AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra XUV 3X0: చేతిలో ఫుల్‌ క్యాష్‌ ఉన్నా ఆరు నెలలు ఆగాల్సిందే.. ఈ కార్లకు డిమాండ్‌

అంతకు ముందు 4 వేలుగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏకంగా 10 వేలకు పెరగడం విశేషం. దీంతో ఈ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఎదురు చూడాల్సిందే. చేతినిండా డబ్బులు ఉన్నాయి, ఫుల్ డౌన్‌పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తామన్నా కుదరదు. ఈ కార్లను ముందుగా ఆర్డర్‌...

Mahindra XUV 3X0: చేతిలో ఫుల్‌ క్యాష్‌ ఉన్నా ఆరు నెలలు ఆగాల్సిందే.. ఈ కార్లకు డిమాండ్‌
Mahindra Xuv 3x0
Narender Vaitla
|

Updated on: Sep 15, 2024 | 6:59 PM

Share

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త కారు రికార్డు సృష్టిస్తోంది. భారీ అమ్మకాలతో దూసుకుపోతోంది. మహీంద్ర ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, మహీంద్ర ఎక్స్‌యూవీ300 కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ మోడల్‌ కార్లు నెలకు సగటును ఏకంగా 9000 నుంచి 10000 వరకు అమ్ముడు పోతున్నాయి.

అంతకు ముందు 4 వేలుగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏకంగా 10 వేలకు పెరగడం విశేషం. దీంతో ఈ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఎదురు చూడాల్సిందే. చేతినిండా డబ్బులు ఉన్నాయి, ఫుల్ డౌన్‌పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తామన్నా కుదరదు. ఈ కార్లను ముందుగా ఆర్డర్‌ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్‌ వేచి చూడాల్సిందే.

ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌పై గరిష్టంగా ఏకంగా ఆరు నెలల ఆగాల్సిందే. దీనిబట్టే ఈ కార్లకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. బేస్ MX1 పెట్రోల్ వేరియంట్ ఆరు నెలల వరకు అత్యధిక వెయిటింగ్ పీరియడ్‌ని ఉంది. కాగా ఇతర వేరియంట్స్‌కు రెండు నెలల సమయం పడుతుంది. మిడ్-స్పెక్ AX5 ట్రిమ్ కూడా నాలుగు నెలల పాటు వెయింటింగ్ పీరియడ్ ఉండడం గమనార్హం. ఇంతకీ కార్లకు ఇంత డిమాండ్‌ ఎందుకు ఉంది.? ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్‌ను ఇచ్చారు. లెవెల్ 2 ADAS టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్‌ని కూడా అందించారు. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ వేరియంట్స్‌లో ఈ కారును తీసుకొచ్చారు. ఇక పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకొచ్చారు. అయితే డీజిల్‌ ఇంజన్‌ మాన్యువల్‌, 6-స్పీడ్ AMT వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ధర రూ. 7.49 లక్షల నుంచి రూ. 15.49 లక్షల వరకు ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?