AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఖాళీ బీర్‌ బాటిల్స్‌తో కళ్లు చెదిరే వ్యాపారం.. నెలకు రూ. 50 వేలు పక్కా ఆదాయం

కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా మంచి లాభాలను అందించే వ్యాపారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియాల్లో బాటిల్‌ రీసైక్లింగ్ ఒకటి. తాగి పడేసిన బీర్ బాటిల్స్‌తో మంచి లాభాలను ఆర్జించవచ్చు...

Business Idea: ఖాళీ బీర్‌ బాటిల్స్‌తో కళ్లు చెదిరే వ్యాపారం.. నెలకు రూ. 50 వేలు పక్కా ఆదాయం
Business Idea
Narender Vaitla
|

Updated on: Sep 16, 2024 | 2:13 PM

Share

జీవితంలో ఏదో ఒక సమయంలో వ్యాపారం ప్రారంభించాలని చాలా మంది ఆసక్తితో ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే లాభాలు రావనే భయంతోనో, పెట్టుబడి ఎక్కువ అవుతుందన్న కారణంతోనో ఆ ఆలోచనను విరమించుకుంటుంటారు.

కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా మంచి లాభాలను అందించే వ్యాపారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియాల్లో బాటిల్‌ రీసైక్లింగ్ ఒకటి. తాగి పడేసిన బీర్ బాటిల్స్‌తో మంచి లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. ఇంతకీ ఈ బాటిల్‌ రీసైక్లింగ్ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాళీ బీర్‌ బాటిల్స్‌ను క్రిస్టల్స్‌గా మార్చి విక్రయిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. బాటిల్స్‌ నుంచి వచ్చే క్రిస్టల్స్‌తో పెద్ద పెద్ద కంపెనీలు గాజు పాత్రలు, సీసలు, గ్లాసులను తయారు చేస్తాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు నిర్మాణం రంగంలో కూడా వీటిని ఉపయోగిస్తంటారు. కాబట్టి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే గ్లాస్‌ బాటిల్‌ పౌడరింగ్‌ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధర మార్కెట్లో రూ. 50 వేల నుంచి రూ. రెండున్న లక్షల వరకు ఉంటాయి. స్థానికంగా ఉండే స్క్రాప్‌ పాయింట్స్‌ నుంచి లేదా నేరుగా వైన్స్‌, బార్ల వద్ద నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. బాటిల్స్‌ను సేకరించిన తర్వాత వాటిని మిషిన్స్‌లో వేస్తే చాలు క్రిస్టల్‌ రూపంలో వస్తాయి. వీటిని కిలోల చొప్పున విక్రయించొచ్చు.

లాభాల విషయానికొస్తే ఇక టన్ను గ్లాస్‌ క్రిస్టల్స్‌ విక్రయిస్తే రూ. 8000 వస్తుంది. ఇందుకు మనకు అయ్యే ఖర్చు సరాసరి రూ. 3000 అవుతుంది. అంటే ఒక టన్ను గ్లాస్‌ క్రిస్టల్స్‌ అమ్మితే రూ. 5000 లాభం వస్తుంది. నెలలో తక్కువలో తక్కువ 10 టన్నుల క్రిస్టల్‌ అమ్మగలిగినా రూ. 50 వేల లాభ ఏటూ పోదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!