Manthara: మంథర లేకపోతే రామాయణం లేదు.. కైకేయితో అయోధ్య వచ్చిన మంథర ఎవరో తెలుసా..!

శ్రీ రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపడానికి మంధర అతిపెద్ద కారణం. ప్రజల దృష్టిలో ఆమె ఇమేజ్ కుటుంబంలో చీలికలు తెచ్చే మహిళ. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత దశరథ రాజు కొడుకు మీ బెంగతో మరణించాడు. ఇంత జరిగినా కైకేయి మంథరను తన దగ్గరే ఉంచుకుంది. అంతెందుకు కైకేయి ఎప్పుడూ మంథర చెప్పిన మాటలను వ్యతిరేకించలేదు. పైగా మంధర మాటలను విధేయత చూపించింది. అంతేకాదు ఆమెను ఎప్పుడూ బానిసలా చూడలేదు.

Manthara: మంథర లేకపోతే రామాయణం లేదు.. కైకేయితో అయోధ్య వచ్చిన మంథర ఎవరో తెలుసా..!
Manthara In Ramayan
Follow us

|

Updated on: Sep 16, 2024 | 8:43 AM

రామాయణం అనే మహా గ్రంథం మానవాళికి అందించడానికి మానవుడైన రాముడు దేవుడిగా కొలవ బడడానికి ముఖ్య కారణం మంధర. అవును మంథర లేకపోతే రాముడి వనవాసం లేదు.. సీతాపహరణ రావణ సంహారం ఇలా ఏమీ ఉండేవి కావేమో… శ్రీ రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపడానికి మంథర అతిపెద్ద కారణం. ప్రజల దృష్టిలో ఆమె ఇమేజ్ కుటుంబంలో చీలికలు తెచ్చే మహిళ. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత దశరథ రాజు కొడుకు మీ బెంగతో మరణించాడు. ఇంత జరిగినా కైకేయి మంథరను తన దగ్గరే ఉంచుకుంది. అంతెందుకు కైకేయి ఎప్పుడూ మంథర చెప్పిన మాటలను వ్యతిరేకించలేదు. పైగా మంథర మాటలను విధేయత చూపించింది. అంతేకాదు ఆమెను ఎప్పుడూ బానిసలా చూడలేదు.

కైకేయితో అయోధ్య వచ్చిన మంధర

కైకేయి అశ్వపతి చక్రవర్తి కుమార్తె. కైకేయి చాలా అందమైన, ధర్మ నిరతి కలిగిన యువతి, ధైర్యవంతురాలు. దశరథ రాజు తన ముగ్గురు రాణులలో కైకేయిని ఎక్కువగా ప్రేమిస్తాడు. పురాణాల కథ ప్రకారం కైకేయికి దశరథ మహా రాజుతో వివాహం జరిగినప్పుడు.. ఆమె పరిచారిక మంథర కైకేయి తో కలిసి తన మాతృభూమిని విడిచి అయోధ్యలో అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

కైకేయితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది

కైకేయి, మంథర ఒకరికొకరు ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నారు. దీని వలన ఆమె ఎప్పుడూ కైకేయితోనే ఉండేది. వాస్తవానికి మంథర నిజానికి అశ్వపతి రాజు సోదరుడు వృహదశ్వుని కుమార్తె. మంథర పూర్వం చాలా అందమైన యువరాణి. కైకేయి, మంథర సోదరీమణులు కావడంతో మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకరినొకరు విడిచి అస్సలు జీవించలేదు.

పురాణాల ప్రకారం మంథర యువరాణి. చాలా తెలివైనది. అయితే బాల్యంలో వచ్చిన అనారోగ్యం కారణంగా దాహం తట్టుకోలేకపోయింది. ఒకరోజు మంథరకు చాలా దాహం వేసి ఒక ద్రవాన్ని తాగింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని అన్ని భాగాలు పనిచేయడం మానేశాయి. రకరకాల చికిత్స ఇచ్చిన అనంతరం మంథర శరీరంలో వ్యాధి నయమైంది. అయితే ఆమె వెన్నెముక శాశ్వతంగా వంకరగా మారింది. ఈ కారణంగా మంధర పెళ్లి కూడా చేసుకోలేదు.

అయితే రామాయణంలో చిన్న పాత్ర అయిన మంథర గత జన్మ గురించి ప్రస్తావన మహాభారతంలో ఉంది.

మంథర దుందుభి అనే గంధర్వ కన్య. రావణుడి వలన అనేక కష్టాలు పడిన దుందుభి బ్రహ్మని ప్రార్ధించింది. అప్పుడు బ్రహ్మ దుందుభికి వరం ఇచ్చాడు. వచ్చే జన్మలో నీ మాటల కారణంగా శ్రీ రాముడి చేతిలో రావణుడు మరణం పొందనున్నాడు. ఇది మంథర గత జన్మ ఇంతకు మించి ఆమె గురించి పెద్దగా ఏ పురాణాల్లోనూ ప్రస్తావన లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి