సాయంత్రం కన్య రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు..ఈ 4 రాశులకు లక్కీ.. ఈ రెండు రాశుల వారికి కష్టాలే..మీరున్నారా చెక్ చేసుకోండి..

కన్యారాశిలో సూర్య భగవానుడి సంచారం కొన్ని రాశులకు లాభదాయకంగా ఉంటుంది. అదే సమయంలో కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడి సంచారం చాలా ఇబ్బందులను తెస్తుంది. కుంభ రాశి, మేష రాశి వారికి సూర్యుని సంచారము మంచిది కాదు. ఈ సంచారము వలన అనుకోని విధంగా అధిక ధనం ఖర్చు అవుతుంది. మరి కొంత మంది తీవ్ర రోగాల బారిన పడవలసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాధులకు సూర్య భగవానుడు కారణం.

సాయంత్రం కన్య రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు..ఈ 4 రాశులకు లక్కీ.. ఈ రెండు రాశుల వారికి కష్టాలే..మీరున్నారా చెక్ చేసుకోండి..
Lord Surya Narayana
Follow us
Surya Kala

|

Updated on: Sep 16, 2024 | 9:32 AM

నవ గ్రహాలకు అధినేత ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు ఈ రోజు సాయంత్రం (సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం)తన రాశిని మార్చుకోనున్నాడు. ప్రస్తుత రాశి సింహరాశి సంచరిస్తున్న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ఈ రాశి మార్పును కన్యా సంక్రాంతి అంటారు. సూర్యుడు గ్రహాల రాజు. ఆత్మ, ధైర్యం, గౌరవ గ్రహంగా కూడా పరిగణించబడుతున్నాడు. అదే సమయంలో కన్యారాశిలో మరో రెండు గ్రహాలతో కలిసి సూర్యుడు ఉండనున్నాడు. దీంతో త్రిగ్రాహి యోగా ఏర్పడనుంది. ఈ త్రిగ్రాహి యోగా కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకుని రానుంది. ఇప్పటికే కన్యారాశిలో కేతువు ఉన్నాడు. సెప్టెంబర్ 23న బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కన్యారాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మూడు గ్రహాలను శుభప్రదంగా భావిస్తారు.

కన్యారాశిలో సూర్య భగవానుడి సంచారం కొన్ని రాశులకు లాభదాయకంగా ఉంటుంది. అదే సమయంలో కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడి సంచారం చాలా ఇబ్బందులను తెస్తుంది. కుంభ రాశి, మేష రాశి వారికి సూర్యుని సంచారము మంచిది కాదు. ఈ సంచారము వలన అనుకోని విధంగా అధిక ధనం ఖర్చు అవుతుంది. మరి కొంత మంది తీవ్ర రోగాల బారిన పడవలసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాధులకు సూర్య భగవానుడు కారణం. కనుక మేషరాశి, కుంభరాశిపై సూర్యుని సంచారం మంచి ప్రభావం చూపదు. ఈ సమయంలో ఈ రాశులకు చెందిన వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది.

ఏ రాశుల వారికి లాభదాయకం అంటే

కన్య రాశి: సూర్య సంచార ప్రభావం వల్ల కన్యా రాశి వారు మరింత చురుకుగా ఉంటారు. సవాళ్లను సులభంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి ఇది ఉత్తమ సమయం. కొత్త ఆరోగ్యకరమైన అలవాట్లను స్వీకరించడానికి మీరు పూర్తి శక్తితో ఉంటారు. జీవితంలో లక్ష్యాల గురించి స్పష్టత ఉంటుంది. జీవిత లక్ష్యాలను సాధించడంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

తుల రాశి: త్రిగ్రాహి యోగం ఈ రాశి వారిపై సానుకూల ప్రభావం చూపనుంది. వ్యాధుల నుంచి ఉపశమనం కలగనుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పని వల్ల సమాజంలో గౌరవం, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా సూర్య సంచారంతో సానుకూలంగా ప్రభావితం కాబోతున్నారు. బుధుడు, సూర్యుడు, కేతువుల ఆశీస్సుల వల్ల ఆర్థిక ప్రయోజనాలను అందుకోనున్నారు. కాలానుగుణంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. జీవితంలో శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన వ్యాపారం కూడా నడుస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

మకర రాశి: త్రిగ్రాహి యోగం ఈ రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. మకర రాశి వారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. తక్కువ ఖర్చు .. ఎక్కువ ఆదాయం కారణంగా, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

ఈ రాశుల వారు నష్టపోతారు

సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 7:52 గంటలకు సూర్యభగవానుడు తన రాశి సింహరాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మేషం, కుంభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీరు అధిక ఖర్చులు చేయడమే కాదు దుఃఖంతో కూడా ఇబ్బంది పడతారు.

మేషరాశి: సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించి ఆరవ ఇంట్లో ఉండటం వల్ల.. మేష రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరవ ఇల్లు వ్యాధులు, ఊహించని ఖర్చులు, అప్పులు, శత్రువులు, ఇబ్బందులను కలుగు జేస్తుంది. పంచమేషుడు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల మేష రాశి వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మేషరాశి వారు కడుపు సంబంధిత వ్యాధులతో పాటు, చదువు, పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి సూర్యుడు ఎనిమిదవ ఇంట్లోకి అడుగు పెట్టనున్నాడు.. దీంతో వీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సప్తమేషుడు వివాహానికి అధిపతి.. ఎనిమిదవ ఇంట్లో రవి సంచారం కారణంగా కుంభ రాశికి చెందిన వ్యక్తులు వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామి మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. భార్యాభర్తల మధ్య వాదనలు ఏర్పడి పరిస్థితి ఇబ్బంది కరంగా మారుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి