AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ బిజీబిజీ.. నేడు రాష్ట్రానికి రూ. 8వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్న ప్రధాని

ప్రధాని మోడీ ఈరోజు అహ్మదాబాద్‌లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది కాకుండా అహ్మదాబాద్‌లో 30 మెగావాట్ల సోలార్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం-గ్రామీణ కింద 30 వేలకు పైగా ఇళ్లను ఆమోదించి, ఈ ఇళ్లల్లో మొదటి విడత విడుదల చేయనున్నారు. దీంతో పాటు పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నారు.

PM Modi: గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ బిజీబిజీ.. నేడు రాష్ట్రానికి రూ. 8వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్న ప్రధాని
Pm Modi Gujarath Tour
Surya Kala
|

Updated on: Sep 16, 2024 | 9:04 AM

Share

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈరోజు గుజరాత్‌కు ప్రధాని మోడీ 8000 కోట్ల రూపాయలను బహుమతి ఇవ్వనున్నారు. దీనితో పాటు భారతదేశపు మొట్టమొదటి వందే మెట్రో భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. అంతేకాదు అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. గుజరాత్ లో పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ నిన్న సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు.

ప్రధాని మోడీ ఈరోజు అహ్మదాబాద్‌లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది కాకుండా అహ్మదాబాద్‌లో 30 మెగావాట్ల సోలార్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం-గ్రామీణ కింద 30 వేలకు పైగా ఇళ్లను ఆమోదించి, ఈ ఇళ్లల్లో మొదటి విడత విడుదల చేయనున్నారు. దీంతో పాటు పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నారు.

ఈ వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు

  1. నాగ్‌పూర్ నుండి సికింద్రాబాద్
  2. కొల్హాపూర్ నుండి పూణే
  3. ఇవి కూడా చదవండి
  4. ఆగ్రా కాంట్ నుండి బనారస్
  5. దుర్గ్ టు విశాఖపట్నం
  6. పూణే టు హుబ్లీ
  7. వారణాసి నుండి ఢిల్లీ

కచ్ లిగ్నైట్ థర్మల్ పవర్ స్టేషన్, కచ్‌లో 35 మెగావాట్ల బిఇఎస్ సోలార్ పివి ప్రాజెక్ట్ , మోర్బి , రాజ్‌కోట్‌లలో 220 కిలోవోల్ట్ సబ్‌స్టేషన్‌లను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో గాంధీనగర్‌లో రీ-ఇన్వెస్ట్ 2024 నాల్గవ ఎడిషన్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలు దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ హైడ్రోజన్, భవిష్యత్ ఇంధన పరిష్కారాలపై ప్రత్యేక చర్చలు జరగానున్నాయి. ఇవి మాత్రమే కాదు గాంధీనగర్‌లో ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారులతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు.

గుజరాత్ లో ప్రధాని మోడీ కార్యక్రమంషెడ్యుల్ ఎలా సాగనున్నదంటే

  1. ఉదయం 09:45 గంటలకు గాంధీనగర్‌లో సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారులతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు.
  2. ఉదయం 10:30 గంటలకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రీ-ఇన్వెస్ట్‌ను ప్రారంభిస్తారు.
  3. మధ్యాహ్నం 1:45 గంటలకు అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించి, సెక్షన్-1 మెట్రో స్టేషన్ నుండి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.
  4. మధ్యాహ్నం 3:30 గంటలకు రూ. 8000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!