Kal Bhairav Temple: నేటికీ సైన్ చేధించని మిస్టరీ ఈ ఆలయం.. రోజూ మద్యపానం చేసే కాల భైరవ స్వామీ..

ఈ ఆలయంలో దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. ప్రతిరోజూ కాలభైరవుడికి మంత్రాలు జపించిన తరువాత.. దాదాపు 2,000 మద్యం బాటిళ్లను సమర్పిస్తారు. కాల భైరవుని మద్యపానం చేస్తాడు. ఈ ఆలయ రహస్యాన్ని ఇప్పటి వరకు పరిశోధనలు చేస్తున్న పురావస్తు శాఖ కూడా కనిపెట్టలేకపోయింది. ఇక్కడ కాల భైరవస్వామి మద్యం తాగే అలవాటు శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.

Kal Bhairav Temple: నేటికీ సైన్ చేధించని మిస్టరీ ఈ ఆలయం.. రోజూ మద్యపానం చేసే కాల భైరవ స్వామీ..
Kaala Bhairava Temple
Follow us

|

Updated on: Sep 16, 2024 | 9:57 AM

భారతదేశంలోని ప్రతి ఆలయానికి సొంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు కొన్ని దేవాలయాలు కొన్ని రహస్యాలకు నెలవు కూడా.. కొన్ని దేవాలయాలలో శబ్దం వినబడుతుంది. కొన్ని దేవాలయాలలో శివ లింగం లేదా విగ్రహాల సైజ్ పెరుగుతుంది. ఇలా అనేక రహస్యాలు దాచుకున్న ఆలయాలకు చెందిన మిస్టరీలను కొన్నిటిని నేటికీ చేదించలేదు. అటువంటి రహస్యమైన దేవాలయాలలో ఒక కాల భైరవ ఆలయం. ఈ ఆలయం వెలుపల ఏడాది పొడవునా మద్యం అమ్ముతారు. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మద్యం తాగుతుంది కూడా..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..?

రహస్యాలతో నిండిన ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయం పేరు కాల భైరవ దేవాలయం. శివుని ఐదవ అవతారంగా కాల భైరవ స్వామిని పరిగణిస్తారు. ఈ ఆలయం లోని కాల భైరవ విగ్రహం సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టించబడింది. ఈ ఆలయంలో కాల భైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు. ఈ నమ్మకం కారణంగా సంవత్సరం పొడవునా ఆలయం వెలుపల మద్యం విక్రయిస్తారు.

దేవుడు మద్యం తాగుతాడు

ఈ ఆలయంలో దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. ప్రతిరోజూ కాలభైరవుడికి మంత్రాలు జపించిన తరువాత.. దాదాపు 2,000 మద్యం బాటిళ్లను సమర్పిస్తారు. కాల భైరవుని మద్యపానం చేస్తాడు. ఈ ఆలయ రహస్యాన్ని ఇప్పటి వరకు పరిశోధనలు చేస్తున్న పురావస్తు శాఖ కూడా కనిపెట్టలేకపోయింది. ఇక్కడ కాల భైరవస్వామి మద్యం తాగే అలవాటు శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.

ఇవి కూడా చదవండి

కాలభైరవునికి ఇష్టమైన రోజు

హిందూ దేవతలను, దేవుళ్ళను ఆరాధించడానికి ఒక ప్రత్యేక రోజు ఉంది. అదేవిధంగా కాలభైరవ స్వామిని పూజించడానికి ఉత్తమ రోజులు ఆదివారం, మంగళవారంగా పరిగణిస్తున్నారు. కనుక ఈ రెండు రోజుల్లో కాలభైరవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. కాల భైరవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఏర్పడిన బాధలు తొలగిపోతాయని, శనిశ్వరుడి కోపాన్ని కూడా శాంతపరుస్తుందని నమ్ముతారు.

తంత్ర సాధనకు కేంద్రంగా కాల భైరవ ఆలయం

పురాతన కాలంలో తాంత్రికులు మాత్రమే తమ తాంత్రిక కార్యక్రమాలను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చేవారని చెబుతారు. అయితే కొంతకాలం తర్వాత ఈ ఆలయం సామాన్యుల దర్శనానికి తెరవబడింది. అనంతరం ఈ ఆలయానికి చెందిన రహస్యాలు, అద్భుతాల కారణంగా ప్రజలలో ప్రసిద్ధి చెందింది.

కాల భైరవుడు జనన రహస్యం ఏమిటంటే

పురాణాల ప్రకారం కాలభైరవుడు శివుని రక్తం నుండి జన్మించాడు. తరువాత ఈ రక్తం రెండు భాగాలుగా విభజించబడింది. అందులో ఒకటి బతుక భైరవుడికి, మరొకటి కాల భైరవుడికి జన్మనిచ్చింది. ఇందులో బతుక్ భైరవ్‌ని బాల రూపం అని, కాల భైరవుడిని యువ రూపంగా భావించి పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!