Ujjain: 5వేల ఏళ్లనాటి పురాతన ఆలయం.. యముడిని బంధించిన శివుడిని దర్శించుకుంటే దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం..

దేశంలో శివభక్తులు, శివాలయాలు, శివలింగాల సంఖ్య అసంఖ్యాకమే. అలాంటి ఆలయాల్లో ఒకటి యమధర్మ రాజుని శివుడిని బంధించిన ఆలయం. పురాణాల ప్రకారం, ఈ ఆలయంలోనే మార్కండేశ్వరుడు.. శివుడి కోసం తపస్సు చేసి యమరాజును ఓడించి అమరుడయ్యాడు. భక్తులను రక్షించడానికి శిడువు ఈ ఆలయంలోనే యమరాజును బంధించి ఉంచాడని నమ్ముతారు. ఈ పురాతన, ప్రసిద్ధ ఆలయంలో మహాదేవుని దర్శనం చేసుకున్న భక్తులు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం పొందుతారని విశ్వాసం.

Ujjain: 5వేల ఏళ్లనాటి పురాతన ఆలయం.. యముడిని బంధించిన శివుడిని దర్శించుకుంటే దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం..
Markandeshwar Mahadev Temple
Follow us
Surya Kala

|

Updated on: Sep 16, 2024 | 11:03 AM

దేశంలో చిన్న, పెద్ద దేవాలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిలో చాలా దేవాలయాల ప్రధాన దైవంగా విష్ణుఉ, శివుడు, దుర్గాదేవి, హనుమంతుడు, గణపతి వంటి దేవుళ్లు భక్తులకు దర్శనం ఇస్తూ పూజలను అందుకుంటున్నారు. వేల సంవత్సరాల పురాతన ఆలయాల్లో శివుడు, శివ భక్తులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. దేశంలో శివభక్తులు, శివాలయాలు, శివలింగాల సంఖ్య అసంఖ్యాకమే. అలాంటి ఆలయాల్లో ఒకటి యమధర్మ రాజుని శివుడిని బంధించిన ఆలయం. పురాణాల ప్రకారం, ఈ ఆలయంలోనే మార్కండేశ్వరుడు.. శివుడి కోసం తపస్సు చేసి యమరాజును ఓడించి అమరుడయ్యాడు. భక్తులను రక్షించడానికి శిడువు ఈ ఆలయంలోనే యమరాజును బంధించి ఉంచాడని నమ్ముతారు. ఈ పురాతన, ప్రసిద్ధ ఆలయంలో మహాదేవుని దర్శనం చేసుకున్న భక్తులు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం పొందుతారని విశ్వాసం.

పురాణం, చరిత్ర

ఉజ్జయినిలో శివునికి చెందిన అద్భుత ఆలయం ఉంది. చారిత్రక కథనాల ప్రకారం 5000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం విక్రమాదిత్య చక్రవర్తి కాలం నాటిదని నమ్ముతారు. పురాణాల ప్రకారం భక్తులను రక్షించడానికి శివుడు స్వయంగా ఆ ఆలయంలో యమరాజును బంధించాడు. బ్రహ్మ గురించి తపస్సు చేసిన మృకండ మహర్షి కొడుకుని వరంగా పొందాడు. అల్ప ఆయుస్సుతో ఉన్న కొడుకు పుట్టాడు. ఆ కుమారుడికి మార్కండేయుడుగా పేరు పెట్టి పెంచుతున్నారు. అయితే ఋషి మృకండ తన కుమారుడు మార్కండేయుని ఆయుస్సు గురించి ఆందోళన చెందాడు. తండ్రి దిగులుగా ఉండడం చూసి కొడుకు గుండె తరుక్కుపోయింది. తన కొడుకు కోరికపై మృకండ ఋషి అతని జన్మ వృత్తాంతం మొత్తం చెప్పాడు. తన తల్లిదండ్రుల శోకాన్ని పోగొట్టి ఆయురారోగ్యాలు పొందేందుకు మార్కండేయుడు అవంతిక తీర్థంలోని మహాకాల వనంలో ఉన్న అదే ఆలయంలో శంకరుడిని ఉద్దేశించి కఠోర తపస్సు చేశాడు. అతనికి 12 సంవత్సరాల వయస్సుకి వచ్చిన తర్వాత యమరాజు మార్కండేయుడిని తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే మార్కండేయుడు యముడితో వెళ్ళడానికి తాను మరణించడానికి ఇష్టపడలేదు. యమరాజు నుంచి తనని తాను కాపాడుకోవడం కోసం రెండు చేతులతో శివుని విగ్రహాన్ని పట్టుకున్నాడు.

యమధర్మ రాజును బంధించిన శివుడు

మార్కండేయుడి ప్రాణం తీయడానికి యమరాజు భూమిపైకి వచ్చినప్పుడు.. యముడి నుంచి తన భక్తుడిని రక్షించడానికి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుడిని రక్షించడానికి యమ ధర్మ రాజును ఆ ఆలయంలో బంధించాడు. మార్కండేయ మహర్షి 12 కల్పాలు జీవించే వరం ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

దక్షిణాభిముఖంగా శివలింగం

యమరాజు ఈ ఆలయంలో బంధించబడ్డాడు. ఆలయంలో ప్రతిష్టించిన శివలింగంపై సహజంగా ఒక కన్ను ఉంది. దక్షిణం కాలానికి దిశ. హిందూ విశ్వాసం ప్రకారం భక్తులను రక్షించడానికి యముడిని మహా శివుడిని ఇక్కడ బంధించాడు. మార్కండేశ్వరుడు మహాదేవుని పూజించడం ద్వారా భక్తులు ఆయురారోగ్యాలు పొందుతారు. ఈ అద్భుత ఆలయం ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తుంది. పండుగలు లేదా పుట్టినరోజులు లేదా వివాహ వార్షికోత్సవాలు వంటి శుభ సందర్భాలలో వేలాది మంది శివ భక్తులు దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ప్రార్థించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..