Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తిండి, నిద్రకు ఓ సమయం అంటూ ఏదీ ఉండటంలేదు. అర్ధరాత్రి తర్వాత నిద్రపోవడం.. సూర్యోదయం తర్వాత నిద్రలేవడం ఇదే జరుగుతోంది. అయితే కొందరు మాత్రం ఎంత ఆలస్యంగా నిద్రపోయినా తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటుగా ఉంటుంది. ఆ సమయంలో నిద్రలేస్తే ఎంతో మంచిదని మన పెద్దలు కూడా చెబుతారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తిండి, నిద్రకు ఓ సమయం అంటూ ఏదీ ఉండటంలేదు. అర్ధరాత్రి తర్వాత నిద్రపోవడం.. సూర్యోదయం తర్వాత నిద్రలేవడం ఇదే జరుగుతోంది. అయితే కొందరు మాత్రం ఎంత ఆలస్యంగా నిద్రపోయినా తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటుగా ఉంటుంది. ఆ సమయంలో నిద్రలేస్తే ఎంతో మంచిదని మన పెద్దలు కూడా చెబుతారు. దానినే బ్రహ్మ ముహూర్తం అంటారు. తెల్లవారుజామున మూడున్నర గంటలనుంచి ఐదున్నర గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. పూర్వం మహర్షులు, రుషులు ఆధ్యాత్మిక చింతన చేసేందుకు ఈ పవిత్రమైన సమయాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్లు కూడా సంగీత సాధనకూ, చదువుకునేందుకూ పిల్లల్ని బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా గంటా ముప్ఫైఆరు నిమిషాల ముందుగా వచ్చే ఈ సమయంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని.. ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు… ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు ఎర్రని కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత అరుణ కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం. ఆహ్లాదకరంగా అనిపించడంతోపాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు
చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది
Anchor Shyamala: యాంకర్ శ్యామల.. కొట్టేశారా ఛాన్స్
కోతి చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు బలి !! అసలు ఏం జరిగిదంటే ??
Squid Game: స్క్విడ్ గేమ్.. హిందీ చిత్రం “లక్”కు కాపీనా ??