AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Typhoon Bebinca: చైనా మీద పగబట్టిన ప్రకృతి.. వరస తుఫాన్ల బీభత్సం.. షాంఘైను తాకిన బలమైన బెబింకా తుపాను..

మన పొరుగు ద్శం చైనామీద ప్రకృతి పగబట్టినట్లు ఉంది. ఈ ఏడాదిలో అడుగు పెట్టింది మొదలు దాదాపు 16 తుఫాన్లు డ్రాగన్ కంట్రీలో బీభత్సం సృష్టించాయి. తాజాగా చైనాను మరో తుఫాన్ వణికిస్తోంది. దీనిని బెబింకా అనే పేరు పెట్టారు. ఈ బెబింకా తుపాను తమ దేశాన్ని సమీపిస్తున్న నేపథ్యంలో షాంఘైలో అలర్ట్ ప్రకటించారు. దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే సన్నాహాలు చేశారు.

Typhoon Bebinca: చైనా మీద పగబట్టిన ప్రకృతి.. వరస తుఫాన్ల బీభత్సం.. షాంఘైను తాకిన బలమైన బెబింకా తుపాను..
Typhoon Bebinca
Surya Kala
|

Updated on: Sep 16, 2024 | 11:27 AM

Share

మన పొరుగు ద్శం చైనామీద ప్రకృతి పగబట్టినట్లు ఉంది. ఈ ఏడాదిలో అడుగు పెట్టింది మొదలు దాదాపు 16 తుఫాన్లు డ్రాగన్ కంట్రీలో బీభత్సం సృష్టించాయి. తాజాగా చైనాను మరో తుఫాన్ వణికిస్తోంది. దీనిని బెబింకా అనే పేరు పెట్టారు. ఈ బెబింకా తుపాను తమ దేశాన్ని సమీపిస్తున్న నేపథ్యంలో షాంఘైలో అలర్ట్ ప్రకటించారు. దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే సన్నాహాలు చేశారు. షాంఘై అధికారులు ఆదివారం అనేక విమానాశ్రయాలలో షెడ్యూల్ చేసిన వందలాది విమానాలను రద్దు చేశారు. మరోవైపు సోమవారం తెల్లవారుజామున బెబింకా తుపాను షాంఘై తీరాన్ని తాకింది. ఓ రేంజ్ లో విజ్రుమ్భిస్తోంది. గత 75 ఏళ్ల కాలంలో ఆ దేశ ఆర్ధిక నగరమైన షాంఘైను తాగిన తుఫాన్ ఇదేనని వాతావరణ శాఖా అధికారులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత షాంఘైలోని హాంగ్‌కియావో, పుడాంగ్ విమానాశ్రయాల నుండి షెడ్యూల్ చేసిన అన్ని విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో 600కు పైగా విమానాలు ప్రభావితం కానున్నాయి. షాంఘై అధికారులు కొన్ని వంతెనలపై, రహదారులపై వాహనాలు ప్రయాణించడం కూడా నిషేధించారు.

బెబింకా తుఫాను షాంఘై తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో గంటకు 151 కి.మీ. వేగంతో ముందుకు కదులుతూ ఈ రోజు (సోమవారం) నగరాన్ని తాకింది. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు మొత్తం నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. చైనా వాతావరణ యంత్రాంగం ప్రకారం తుఫాను ప్రభావం కారణంగా ఈ ప్రాంతంలో వీచే గాలుల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది

ఇవి కూడా చదవండి

గత 15 రోజుల్లో ఇది రెండో పెను తుపాను

అదే సమయంలో పరిపాలన అధికారులు కూడా ఈ భయంకరమైన తుఫాను ఎదుర్కోవడానికి ముందస్తు సన్నాహాలు చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రభుత్వ మీడియా వార్తల ప్రకారం తుఫాను దృష్ట్యా షాంఘై జిల్లా నుండి 9,318 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంతలో సమీపంలోని ఝౌషాన్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, దుకాణాలు తెల్లవారుజాము నుంచి మూసివేశారు.

తుపాను తీవ్రత దృష్ట్యా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభుత్వ మీడియా ప్రకారం, తుఫాను కారణంగా తూర్పు తీరం ఎక్కువగా ప్రభావం కానుంది.. కొన్ని ప్రాంతాల్లో 10 అంగుళాల (254 మిమీ) వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. గత 15 రోజుల్లో చైనాలో ఇది రెండో పెను తుపాను.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..