- Telugu News Photo Gallery Know about South Indian temple hall at the Philadelphia Museum of Art in USA
Philadelphia Museum: విదేశాల్లో భారతీయ శిల్ప సౌందర్యం… ఆకట్టుకుంటున్న మండపం.. మధురై నాయకరాజుల కాలం నాటిదిగా గుర్తింపు
ఈ ఫోటో చూస్తుంటే ఇదేక్కడో దక్షిణ భారత దేశంలోని హిందూ ఆలయమో లేక రాజులకు చెందిన పురాతన కట్టడమో అనుకుంటున్నారా... అయితే మీ ఊహ తప్పే...ఇది అసలు భారత దేశంలోనే లేదు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో ఉన్న ఫిలడెల్ఫియా మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్స్ లో ఉన్న మండపం ఇది.
Updated on: Sep 16, 2024 | 1:11 PM

భారత దేశంలో ఉండాల్సిన కట్టడం అక్కడేందుకుంది అనేదేగా మీ సందేహం...మీ సందేహం తీర్చడానికి కొండవీడు పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి అమెరికాలో పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ కట్టడాన్ని సందర్శించి వివరాలు తెలియజేశారు.

అమెరికాకు చెందిన దంపతులు తమిళనాడులో పర్యటించిన సందర్భంలో ఈ మండపాన్ని చూసి ముచ్చటపడ్డారట... అద్బుత శిల్పసౌందర్యంతో అలరారుతున్న శిల్పాలను తన దేశానికి తీసుకెళ్లడానికి అనుమతి కోరారట.. అనంతరం వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్లి అక్కడ నిర్మాణం చేసి కళాత్మక ప్రదర్శన శాలలో ఉంచారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న శివారెడ్డి ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి వాటిని చూసి ఏవిధంగా ఆమండపాన్ని కాపాడుకుంటున్నారో తెలుసుకున్నారు

అయితే ఈ నిర్మాణం మధురై నాయకరాజుల కాలం నాటిదిగా గుర్తించారు. మధురై నాయక రాజులు విజయనగర రాజులకు సామంతులుగా ఉండి అనేక నిర్మాణాలు చేపట్టినట్లు శివారెడ్డి తెలిపారు. ఫిలడెల్ఫియా మ్యూజియం నిర్వాహకులు అనేక నిర్మాణాలను కొనుగోలు చేసి వాటిని పరిరక్షిస్తున్నట్లు చెప్పారు.

కొండవీటు కోటలోని అనేక శిల్పాలు కూడా మాయమైపోయాయని వాటిని పరిరక్షించేందుకే కమిటీని ఏర్పాటు చేసి రక్షించుకుంటూ వస్తు్న్నట్లు శివారెడ్డి చెప్పారు. దేశంలో ఉన్న పురాతన సంపదను కాపాడుకోవటానికి స్థానికులే ముందుకు రావాల్సి ఉందని అలా కాకుంటే మన శిల్పాలను, కట్టడాలను ఎక్కడో ఉన్న అమెరికా వెళ్లి చూసి రావాల్సి ఉంటుందన్నారు.
