- Telugu News Photo Gallery Cinema photos Siddharth and Aditi Rao Hydari get married at Sri Ranganayaka Swamy Temple in Wanaparthy see photos
Siddharth – Aditi Rao Hydari: వేడుకగా సిద్ధార్థ్, అదితి వివాహం.. పెళ్లి ఫోటోస్ చూశారా..? ఎంత అందంగా ఉన్నారో..
దక్షిణాది హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని శ్రీరంగనాయక దేవాలయంలో వీరిద్దరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అదితి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
Updated on: Sep 16, 2024 | 12:28 PM

దక్షిణాది హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని శ్రీరంగనాయక దేవాలయంలో వీరిద్దరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.

తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అదితి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా నక్షత్రలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరల్గా మారాయి. దీంతో నూతన జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే అదే ఆలయంలో వీరిద్దరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది.

సిద్ధార్థ్, అదితి ఇద్దరూ కలిసి మహా సముద్రం సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. సిద్ధార్థ్ తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో ప్రపోజ్ చేశాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అదితి.

హైదరాబాద్ లో తన నాన్నమ్మ ప్రారంభించిన స్కూల్ తనకు చాలా ప్రత్యేకమని.. కొన్నేళ్ల క్రితమే ఆమె కన్నుమూశారని.. ఈ విషయం సిద్ధార్థ్ కు కూడా తెలుసని అన్నారు. ఓరోజు తనను ఆ స్కూల్ కు తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశాడని తెలిపింది.

అలాగే వనపర్తిలోని శ్రీరంగనాయక స్వామి దేవాలయం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని.. అందుకే నిశ్చితార్థం అక్కడ చేసుకున్నామని.. ఇక పెళ్లి కూడా అక్కడే జరుగుతుందని ఇటీవల చెప్పుకొచ్చింది. సిద్ధా్ర్థ్, అదితి వివాహం అదే దేవాలయంలో జరిగింది.




