Mystery Sounds: మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!

సరిగ్గా ఏడాది క్రితం.. 2023 సెప్టెంబరులో భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు ఓ మిస్టరీ సిగ్నల్‌ వినిపించింది. ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటికా వరకు ప్రపంచమంతా అది రికార్డ్‌ అయ్యింది. ముందెన్నడూ ఇలాంటి శబ్దాలు వినకపోవడంతో శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. అధ్యయనంలో మిస్టరీ వీడింది. అందుక్కారణం గ్రీన్‌లాండ్‌ లో భారీ మంచు చరియలు విరిగిపడటమేనని తెలిసింది.!

Mystery Sounds: మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!

|

Updated on: Sep 16, 2024 | 11:11 AM

సరిగ్గా ఏడాది క్రితం.. 2023 సెప్టెంబరులో భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు ఓ మిస్టరీ సిగ్నల్‌ వినిపించింది. ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటికా వరకు ప్రపంచమంతా అది రికార్డ్‌ అయ్యింది. ముందెన్నడూ ఇలాంటి శబ్దాలు వినకపోవడంతో శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. అధ్యయనంలో మిస్టరీ వీడింది. అందుక్కారణం గ్రీన్‌లాండ్‌ లో భారీ మంచు చరియలు విరిగిపడటమేనని తెలిసింది.! గతేడాది సెప్టెంబరులో వరుసగా 9 రోజుల పాటు ఈ వింత శబ్దాలు వినిపించాయి. సాధారణ భూకంప శబ్దాల కంటే భిన్నంగా నిరంతరం వైబ్రేషన్‌ ఫ్రీక్వెన్సీతో అది వినబడటంతో శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. భూమి లోపల గుర్తుతెలియని వస్తువేదైనా ప్రయాణిస్తోందా? అని అనుమానించారు. దీంతో ఈ శబ్దాలపై లోతుగా పరిశోధనలు చేపట్టారు. చివరకు అవి మంచు చరియల కారణంగా ఏర్పడ్డ సునామీ అలల శబ్దాలని తేలింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు తమ అధ్యయనాన్ని ఓ జర్నల్‌లో షేర్‌ చేశారు.

తూర్పు గ్రీన్‌లాండ్‌లోని డిక్సన్‌ ఫోర్డ్‌ ప్రాంతంలో 4వేల అడుగుల ఎత్తులో ఉండే మంచు పర్వతాల బేస్‌ వద్ద ఉన్న హిమానీనదం గత కొంతకాలంగా కరుగుతూ వస్తోంది. దీంతో గ్లేసియర్‌ కొన్ని పదుల మీటర్ల మందాన్ని కోల్పోయి పల్చగా మారింది. ఫలితంగా ఆ పర్వతాలు పట్టును కోల్పోవడంతో ఈ మంచు చరియలు విరిగినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతేడాది మంచు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో మెగా సునామీ సంభవించింది. చాలా ఎత్తు నుంచి మంచు చరియలు పడటంతో భూమి ఒక్కసారిగా కంపించింది. సునామీ కారణంగా 200 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. ఈ భారీ అలల ప్రభావం 9 రోజుల వరకు కొనసాగిందని అధ్యయనకారులు తెలిపారు. దీని కారణంగానే ప్రతి 90 సెకన్లకోసారి ఆ శబ్దాలు వినిపించినట్లు తెలిపారు. దీనికి గ్లోబల్‌ వార్మింగే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us