Pitru Paksham 2024: పితృ దోషం నుంచి బయటపడేందుకు కాకులకు ఆహారం ఎందుకు అందిస్తారో తెలుసా..

పితృ పక్షం సమయంలో చేసే శ్రాద్ధ కర్మలలో పిండ ప్రధానం చేస్తూ కాకులకు ఆ ఆహారాన్ని అందిస్తారు. పూర్వీకులు స్వేచ్ఛ, శాంతిని పొందుతారని తమ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. దీనితో పూర్వీకులు సంతసించి సాధకునికి దీవెనలు ప్రసాదిస్తారు. ఫలితంగా సాధకుని జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి పితృ పక్షం సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు

Pitru Paksham 2024: పితృ దోషం నుంచి బయటపడేందుకు కాకులకు ఆహారం ఎందుకు అందిస్తారో తెలుసా..
Pitru Paksha 2024
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2024 | 8:16 AM

హిందూ మతంలో పితృ పక్షం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మరణించిన మన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారికి నివాళులర్పించడానికి ఈ పండుగ ఒక ప్రత్యేక సందర్భం. ఈ పితృ పక్ష పండుగ సాధారణంగా భాద్రపద పౌర్ణమి తిధి నుంచి భాద్రపద కృష్ణ పక్ష అమావాస్య వరకు 16 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధ కర్మలను చేస్తారు. పూర్తి ఆచారాలలో పూర్వీకులకు నైవేద్యాలు, పిండ ప్రదానం వంటి ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. పితృ పక్షం సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైన నియమం ఉంది.

పితృ పక్షం సమయంలో చేసే శ్రాద్ధ కర్మలలో పిండ ప్రధానం చేస్తూ కాకులకు ఆ ఆహారాన్ని అందిస్తారు. పూర్వీకులు స్వేచ్ఛ, శాంతిని పొందుతారని తమ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. దీనితో పూర్వీకులు సంతసించి సాధకునికి దీవెనలు ప్రసాదిస్తారు. ఫలితంగా సాధకుని జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి పితృ పక్షం సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే పితృ పక్షంలో కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం…

పూర్వీకులు కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు పెడతారు?

ఇవి కూడా చదవండి

హిందూ మతంలో కాకి యమదూత వాహనంగా.. యమ చిహ్నంగా పరిగణించబడుతుంది. యమ ధర్మ రాజు మృత్యుదేవత. పితృ పక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకుల రూపంలో ఆహారం తీసుకుంటాయని నమ్ముతారు. మనం కాకులకు ఇచ్చే ఆహారం అవి తింటే మన పూర్వీకులు సంతృప్తి పడతారని వారి ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు.

పూర్వీకుల దూత

కొన్ని నమ్మకాల ప్రకారం కాకులను పూర్వీకుల దూతలుగా కూడా పరిగణిస్తారు. కనుక పితృ పక్షం సమయంలో కాకులకు ఆహారాన్ని అందిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.

కాకులు రాముడికి సంబంధించినవిగా నమ్ముతారు

కాకి కూడా రాముడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఇది ఒక పురాణ కథలో ప్రస్తావించబడింది. కథ ప్రకారం ఒకసారి ఒక కాకి సీత దేవి పాదాలను కొరికింది. దీంతో సీతాదేవి కాలికి గాయమైంది. సీత బాధను చూసి రాముడు కోపించి బాణం వేసి కాకిని గాయపరిచాడు. దీని తరువాత కాకి తన తప్పును గుర్తించి సీతారాములకు క్షమాపణలు చెప్పింది. శ్రీ రాముడు వెంటనే కాకిని క్షమించి.. ఇక నుంచి కాకుల ద్వారానే పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి పితృ పక్షంలో కాకులకు ఆహారం పెట్టే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?