Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రకు వేళాయె.. మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడిలోకి..

ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు, రికార్డులతో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్‌ ఈసారి మరో రికార్ట్‌ క్రియేట్‌ చేశాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా గణనాథుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్‌లో ఉండే వారే కాకుండా.. వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా భారీ తరలివచ్చారు. దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రకు వేళాయె.. మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడిలోకి..
Khairatabad Ganesh 2024
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2024 | 7:12 AM

వినాయకచవితి నుంచి  పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికాసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇప్పటికే క్రేన్ సహాయంతో టస్కర్ వాహనంపై ఎక్కించారు.  వాహనం ఎక్కించిన అనంతరం భారీ విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేపట్టారు. ఈ వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు గణపతికి.  అనంతరం గణేశుడి శోభయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు 70 అడుగుల ఎత్తులో ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్యపై భక్తులు కాసుల వర్షం కురిపించారు. ఈసారి హుండీ లెక్కింపులో కళ్లు చెదిరే ఆదాయం వచ్చినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు, రికార్డులతో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్‌ ఈసారి మరో రికార్ట్‌ క్రియేట్‌ చేశాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా గణనాథుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్‌లో ఉండే వారే కాకుండా.. వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా భారీ తరలివచ్చారు. దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. అలా ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెంచారు భక్తులు. గణపతికి ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

సోమవారం శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్‌ బొజ్జ గణపయ్య హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. మొత్తం రూ.70 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం వచ్చినట్లు కమిటీ తెలిపింది. ఖైరతాబాద్‌లో గణపతి ఉత్సవాలు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నప్పటీ.. తొలిసారి ఈ ఏడాది హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగింది.

మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారమూ అత్యంత ప్రత్యేకమనే చెప్పాలి. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్​ బొజ్జ గణపయ్య. గతేడాది 63 అడుగుల వినాయకుడు భక్తులకు కనువిందు చేస్తే… ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిమర్జనం నేపథ్యంలో.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ఖైరతాబాద్, లక్డికాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే