- Telugu News Photo Gallery Spiritual photos Which roads will be closed due to the immersion of Vinayaka Chavithi idols in Hyderabad?
Ganapathi Nimajjanam: ఆ మార్గాల్లో గణపతి విగ్రహాలు ఊరేగింపు.. మీ రూట్ మార్చితే బెస్ట్..
వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో సాధారణ ప్రజలు రాకపోకలకు అంతరాయం కలగవచ్చని, ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు అందుకు అనుగుణంగా ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. ఇప్పుడు విగ్రహాల ఊరేగింపు ఈ మార్గాల్లో రానున్నాయో తెలుసుకుందాం.
Updated on: Sep 16, 2024 | 3:57 PM

బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద గణేష్ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని, కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ (ఎడమ మలుపు), ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లో అంబేడ్కర్ విగ్రహం వైపు వెళ్లాలని సూచించారు.

సికింద్రాబాద్ నుంచి నిమజ్జనం కోసం వచ్చే గణపతి విగ్రహ ఊరేగింపులు విషయానికి వస్తే సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు వెళ్తుంది.

చిలకలగూడ కూడలి నుంచి వచ్చే నిమజ్జన విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ పైవంతెన, వై.జంక్షన్, హిమాయత్‌నగర్ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయని అధికారులు వెల్లడించారు.

ఉప్పల్ ప్రాంతం నుంచి వచ్చే గణేష్ ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్ జంక్షన్, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్‌పుర కూడలి మీదుగా వెళ్తుంది. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకొని, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలుస్తోంది.

దిల్‌సుఖ్‌నగర్ నుంచి నిమజ్జనం కోసం ఊరేగింపుగా వచ్చే గణేష్ విగ్రహాలు ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్డులో కలుస్తోంది. అక్కడి నుంచి మూసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట్ వైపు వెళ్తాయి.

తార్నాక వైపు ఊరేగింపుగా వచ్చే వినాయకుడు విగ్రహాలు రూట్ విషయానికి వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి వద్ద ఊరేగింపు చేరుతుంది.

టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్ నిమజ్జనం ఊరేగింపు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది.

ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి, ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్తోంది.

టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్ ఎక్స్‌రోడ్, గోషామహల్, మాలకుంటజంక్షన్ మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.




