Balapur Laddoo: అందరి చూపూ బాలాపూర్ లడ్డూ వేలం వైపే.. ఈ సారి ఎంత ?

బాలావూర్ గణేశుడి విగ్రహం కంటే.. బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే ఆ లడ్డూపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ ఏడాది వేలం పాటలో ఆ లడ్డూ బద్దలుకొట్టబోయే రికార్డుల కోసమే అందరి ఎదురు చూపులు. గత 30 ఏళ్లుగా సాగుతున్న ఈ లడ్డూ వేలం..ఏటేటా రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. అందుకే ప్రతీ వినాయక చవితికి.. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఎంత పలికింది అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఇక బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది వేలంలో పోటా పోటీగా పాల్గొంటూ ఉంటారు.

Balapur Laddoo: అందరి చూపూ బాలాపూర్ లడ్డూ వేలం వైపే.. ఈ సారి ఎంత ?
Balapur Ganesh Laddu
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2024 | 7:51 AM

పది రోజుల పాటు భక్తులతో పూజలను అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడిని చేరే సమయం ఆసన్నం అయింది. దేశ వ్యాప్తంగా మండపాలలో కొలువు దీరిన బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరడానికి శోభాయాత్రగా బయలు దేరుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు భాగ్యనగరంలోని బాలాపూర్‌ లడ్డూ వేలం పైనే. ప్రతి సంవతసరం వేలంపాటలో రికార్డుస్థాయిలో ధర పలుకుతూ అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచే గణనాథుడి లడ్డూ వేలం పాట కోసం ఇప్పుడు సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది 27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ ఈసారి ఎంత పలుకుతుందన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

లడ్డూ వేలానికి సర్వం సిద్ధం..

వినాయక విగ్రహాల ఎత్తులోనే కాదు.. ఆయన చేతిలో పెట్టే లడ్డూ సైజుల్లో కూడా పోటీ పెరిగింది. ఇక బాలావూర్ గణేశుడి విగ్రహం కంటే.. బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే ఆ లడ్డూపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ ఏడాది వేలం పాటలో ఆ లడ్డూ బద్దలుకొట్టబోయే రికార్డుల కోసమే అందరి ఎదురు చూపులు. గత 30 ఏళ్లుగా సాగుతున్న ఈ లడ్డూ వేలం..ఏటేటా రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. అందుకే ప్రతీ వినాయక చవితికి.. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఎంత పలికింది అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఇక బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది వేలంలో పోటా పోటీగా పాల్గొంటూ ఉంటారు. లక్షలు పెట్టి అయినా సరే బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన

ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రూల్‌ బుక్ మారింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొనాలి అనుకునేవారు.ముందుగా గత ఏడాది వేలం మొత్తం డిపాజిట్ చేయాలి. అంటే 27 లక్షలు ధరావత్తుగా కట్టిన వారి పేరే బాలాపూర్ లడ్డూ వేలంలో ఉంటుంది. అయితే ఇంతకుముందు వరకు స్థానికేతరులకు మాత్రమే ఈ నిబంధన ఉండేది. ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపజేశారు. గ్రామస్తుల నుంచి కూడా వేలంపాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది లడ్డూ పలికిన రూ.27 లక్షలను డిపాజిట్ చేసిన వారికి మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈసారి రూ.30 లక్షలు పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

లడ్డు వేలం పాటలో వీరి మధ్య పోటీ

బాలాపూర్‌ గణేశుడితో పాటు పది రోజులు భక్తులతో పూజలను అందుకున్న లడ్డూని దక్కించుకోవడానికి ఈ ఏడాది డిపాజిట్ తప్పని సరి చేశారు. అది కూడా గత ఏడాది లడ్డు ధరైన రూ. 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం అనే నిబంధన పెట్టారు. దీంతో ఈ లడ్డుని దక్కించుకోవాడానికి డిపాజిట్ కట్టడంతో ప్రధానంగా కొందరి మధ్య పోటీ నెలకొంది.

  1. లింగాల దశరథ్ గౌడ్ -చైతన్య స్టిల్స్..
  2. ప్రణీత్ రెడ్డి, సాహెబ్ నగర్- అర్బన్ గ్రూప్
  3. కొలన్ శంకర్ రెడ్డి – బిజేపీ సీనియర్ లీడర్, బాలాపూర్
  4. లక్ష్మీనారాయణ- శ్రీ గీతా డైరీ, నాదర్గుల్

30 ఏళ్లు పూర్తిచేసుకున్న బాలాపూర్‌ లడ్డూ వేలం

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2023లో బాలాపుర్‌ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. మొదట రూ.450తో ప్రారంభం కాగా.. 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికింది. 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు చేశారు. అయితే ఈసారి పాత రికార్డు బద్దలవ్వడం గ్యారంటీ. బాలాపూర్ క్రియేట్ చేసే కొత్త రికార్డు ఏంటన్నదే ఇప్పుడు సస్పెన్స్. ఇక బాలాపూర్‌ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలంపాట తర్వాత ట్యాంక్‌ బండ్‌ వైపు శోభాయాత్ర ప్రారంభం కానుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే