Ganesh Immersion: వినాయకుడికి వీడ్కోలు ఇలా చెప్పండి.. పఠించాల్సిన మంత్రాలు ఏమిటంటే
హిందూ మతంలో గణపతి నిమజ్జనానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. గణేష్ చతుర్థి పండుగ రోజున భూమి మీదకు వచ్చిన గణపతి తన భక్తుల ఇళ్లకు వచ్చి వారిని ఆశీర్వదించి ఈ రోజుతో గంగమ్మ ఒడిలోకి చేరుకుని ఒక సంవత్సరం పాటు వెళ్లిపోతాడని నమ్ముతారు. నిమజ్జన సమయంలో గణపతి విగ్రహాన్ని నీటిలో విడిచి పెడతారు. నీటిలో వచ్చే ఏడాది మళ్లీ తమ ఇంటికి రమ్మనమని ఆనందంతో తుది వీడ్కోలు పలుకుతారు. నిమజ్జనం సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు.. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
వినాయక చవితి పండుగను భక్తి, శ్రద్దలతో ఉత్సాహంతో జరుపుకున్నారు. 10 రోజుల పాటు ఇంట్లో, మండపాలలో పూజలను అందుకున్న గణపతి విగ్రహాలకు ఈ రోజు వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని గణపతి నిమజ్జనం అని అంటారు. హిందూ మతంలో గణపతి నిమజ్జనానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. గణేష్ చతుర్థి పండుగ రోజున భూమి మీదకు వచ్చిన గణపతి తన భక్తుల ఇళ్లకు వచ్చి వారిని ఆశీర్వదించి ఈ రోజుతో గంగమ్మ ఒడిలోకి చేరుకుని ఒక సంవత్సరం పాటు వెళ్లిపోతాడని నమ్ముతారు. నిమజ్జన సమయంలో గణపతి విగ్రహాన్ని నీటిలో విడిచి పెడతారు. నీటిలో వచ్చే ఏడాది మళ్లీ తమ ఇంటికి రమ్మనమని ఆనందంతో తుది వీడ్కోలు పలుకుతారు. నిమజ్జనం సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు.. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
గణపతి నిమజ్జనానికి అనుకూలమైన సమయం
దృక్ పంచాంగం ప్రకారం అనంత చతుర్దశి నాడు బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఉదయం 9.10 గంటల నుండి మధ్యాహ్నం 1.47 గంటల వరకు శుభ సమయం. ఈ శుభ సమయంలో గజాననుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
గణేష్ విసర్జన సమయంలో ఈ నియమాలను పాటించండి
గణేష్ నిమజ్జనంలో సమయం చాలా ముఖ్యమైనది. పంచాంగం ప్రకారం నిమజ్జనం శుభ సమయంలో మాత్రమే చేయాలి. ఎందుకంటే శుభ ముహూర్తంలో చేసే పూజల వల్లనే శుభ ఫలితాలు కలుగుతాయి.
ఆచారాల ప్రకారం పూజ
నిమజ్జనానికి ముందు గణపతి బప్పకు విధిగా పుజాదికర్యక్రమలను నిర్వహించాలి. ఆపై హారతి ఇచ్చి.. వచ్చే ఏడాది మళ్లీ రమ్మన మని ఆహ్వానిస్తూ మీ కోరికని తెలియజేస్తూ గణపతికి వీడ్కోలు చెప్పండి.
విగ్రహం పరిమాణం
విగ్రహం పరిమాణం ప్రకారం ఎక్కడ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. చిన్న విగ్రహాన్ని ఇంటి చుట్టూ ఉన్న చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేయవచ్చు. అదే సమయంలో భారీ విగ్రహం అయితే ప్రవహిస్తున్న నదుల్లో నిమజ్జనం చేసి తుది వీడ్కోలు పలకాల్సి ఉంటుంది.
వచ్చే సంవత్సరానికి రమ్మనమని ఆహ్వానం
నిమజ్జనం సమయంలో వచ్చే ఏడాది మళ్లీ రమ్మన మని గణపతి బప్పాని కోరుతూ ఆశీర్వాదం ఇవ్వమని కొరుకోండి. నిమజ్జనానికి ముందు గణపతి బప్పను సందర్శించండి. అతని నుండి ఆశీర్వాదం పొందండి.
గణేష్ నిమజ్జనం సమయంలో ఈ మంత్రాలను పఠించండి
“ఓం గం గణపతయే నమః”
ఇది గణేశుడికి అంకితం చేయబడిన అత్యంత సాధారణ.. సరళమైన మంత్రం. ఈ మంత్రం జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది. దీనిని జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్
ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా గణేశుడు ప్రసన్నుడై భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు.
గణేష్ నిమజ్జనం ప్రాముఖ్యత
గణేష్ నిమజ్జనం సంప్రదాయం హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆచా. ఈ కార్యక్రమం వినాయక చవితి పది రోజుల పండుగ ముగింపు వేడుకగా నిర్వహించబడుతుంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దీనికి లోతైన మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది. పది రోజుల పాటు ఇంట్లో ఉన్న గణపతి విగ్రహానికి పూజలు చేసిన అనంతరం భక్తులు భావోద్వేగంతో గణపతి బప్పకు వీడ్కోలు పలుకుతారు. గణపతి బప్ప తన భక్తుల ఇళ్లకు వచ్చి పదిరోజులు ఉండి వెళ్లిపోతాడని నమ్ముతారు. నిమజ్జనం ద్వారా వీడ్కోలు పలుకుతారు. ఈ సమయంలో ప్రజలు అందరూ కలిసి పాల్గొంటారు. తద్వారా సామాజిక బంధాలు బలపడతాయి. కనుక ఈ పండుగ ప్రేమ, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి