Dussehra 2025: రాజమండ్రిలో ఘనంగా దసరా వేడుకలు.. నేడు రాజరాజేశ్వరి అమ్మవారిగా బాలా త్రిపుర సుందరి దర్శనం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారి దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహేంద్రవరం బాలా త్రిపుర సుందరి దేవి నేడు భక్తులకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలతో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మైసూర్ తర్వాత రాజమండ్రి దేవి చౌక్ లో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంత ఘనంగా జరుగుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారి దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహేంద్రవరం బాలా త్రిపుర సుందరి దేవి నేడు భక్తులకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలతో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మైసూర్ తర్వాత రాజమండ్రి దేవి చౌక్ లో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంత ఘనంగా జరుగుతున్నాయి… మిరమిడ్లు కొలిపే విద్యుత్ కాంతులతో రాజమండ్రి దేవిచౌక్ దగదగా మెరుస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు .
నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది అవతారాలైన నవదుర్గలను పూజిస్తారు. నవరాత్రి ప్రారంభం రోజున అమ్మవారు శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు వివిధ రూపాల్లో ప్రత్యేక అలంకరణలతో దర్శనం ఇస్తారు. దేవి చౌక్‌లో అలంకరించిన బడిన అమంవారి అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ సమయంలో దేవి చౌక్ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది.
92 సంవత్సరాల వైభవం
కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాలకు, కలకత్తా కాళీమాత ఆరాధనలకు దీటుగా నిలుస్తుంది గోదావరీ తీరాన దేవీచౌక్ లోని జరిగే నవరాత్రి వేడుక. ఈ నాలుగు రోడ్ల కూడలిలో చిన్న దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని దసరా ఉత్సవాల సమయంలో వేలమంది దర్శించుకుంటారు. ఈ తొమ్మిది రోజులూ ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా కుంకుమపూజలు జరుగుతాయి. ఆ తరువాత ప్రారంభమయ్యే పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాల ప్రదర్శనలతో తెల్లవారిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




