AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పొరపాటున కూడా ఈ దిశలలో కూర్చుని భోజనం చేయకండి.. అలా చేస్తే అనారోగ్యం, ఆయుక్షీణం!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. ఇది మన మనస్సు, ఆత్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆహారాన్ని తయారుచేసే విధానం కూడా మన ఆరోగ్యం, జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తినేటప్పుడు ఏ దిశలో కూర్చోవడం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా?

Vastu Tips: పొరపాటున కూడా ఈ దిశలలో కూర్చుని భోజనం చేయకండి.. అలా చేస్తే అనారోగ్యం, ఆయుక్షీణం!
Right Direction To Sit
Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 02, 2025 | 2:00 PM

Share

ఆరోగ్యకరమైన ఆహారం అంటే మీరు ఏం తింటున్నారో మాత్రమే కాదు, ఎక్కడ, ఎలా తింటున్నారో కూడా. వాస్తు శాస్త్రం అనేది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పురాతన శాస్త్రం. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి దిశ, మన ఆరోగ్యం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. మన ఇంటిని సానుకూల శక్తితో నింపడానికి వాస్తు శాస్త్రం నిర్దిష్ట మార్గదర్శకాలను సూచిస్తుంది.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. ఇది మన మనస్సు, ఆత్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆహారాన్ని తయారుచేసే విధానం కూడా మన ఆరోగ్యం, జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తినేటప్పుడు ఏ దిశలో కూర్చోవడం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా?

కూర్చోవడానికి సరైన దిశ: తూర్పు లేదా ఈశాన్య ముఖంగా తినడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఈ దిశ ఆర్థిక శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తుందని భావిస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది.

ఈ దిశలో కూర్చుని తినకూడదు: దక్షిణ దిశకు ముఖం పెట్టి ఆహారం తినకూడదు. అలా చేయడం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది ఆరోగ్యం క్షీణించడానికి, ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మంచం మీద కూర్చుని ఎప్పుడూ తినకండి: వాస్తు ప్రకారం మంచం మీద కూర్చుని తినడం అశుభకరం. అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు అంటున్నారు.

ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలి. డైనింగ్ ఏరియాలో లేత ఆకుపచ్చ, నీలం లేదా తెలుపు వంటి తేలికపాటి, ప్రశాంతమైన రంగులను ఉపయోగించండి. ముదురు లేదా ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించడం సరైనది కాదు. ఎందుకంటే ఇవి భోజన సమయంలో ప్రతికూలతను కలిగిస్తాయి. అశాంతిని సృష్టిస్తాయి.

వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు: మీ ఇంట్లో మీరే వంట చేస్తుంటే ఎల్లప్పుడూ ప్రశాంతమైన, సంతోషకరమైన మనస్సుతో వంటచేయాలి. కోపం లేదా ఒత్తిడిలో వంట చేయడం వల్ల ఆహారంలోకి ప్రతికూల శక్తి శోషించబడుతుంది. ఇది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఈ చిన్న వాస్తు నియమాలను పాటిస్తే, ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు నెలకొంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఫెంగ్ షుయ్ సలహాలు, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడ్డాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. వీటిని విశ్వసించడం లేదా పాటించడం పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..