AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra: ఈ ప్రదేశాల్లో దసరా ఉత్సవాలు వెరీ వెరీ స్పెషల్.. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి..

దేశ వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. చెడుపై మంచికి దక్కిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండగను విజయదశమి అని కూడా అంటారు. ఈ పండగ జరుపుకునే ప్రధాన ఇతివృత్తం ఒకే అయినప్పటికీ మన దేశంలో ప్రాంతీయ సంప్రదాయాలు, ఆచారాలు ఈ పండగకు ప్రత్యేకతని తెస్తాయి. దసరా సందర్భంగా గొప్ప ఊరేగింపులను నిర్వహిస్తారు. ప్రత్యేక సాంప్రదాయ ఆచారాలను పాటిస్తారు. ఈ నేపధ్యంలో దేశంలో దసరా ఉత్సవాలను తప్పనిసరిగా చూడాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 02, 2025 | 10:04 AM

Share
శారద నవరాత్రుల తర్వాత దశమి తిధి రోజున విజయదశమి పండగను జరుపుకుంటారు. దీనినే దసరా అని కూడా అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండగను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండగ ప్రధాన ఇతివృత్తం స్థిరంగా ఉన్నప్పటికీ.. ప్రాంతీయ సంప్రదాయాలు.. ఆచారాలు వేడుకలకు ప్రత్యేకతని తీసుకొస్తాయి. దసరా పండుగల దేశాన్ని ఏకతాటిపైకి తెస్తుంది. మన దేశంలో దసరా వేడుకలను ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

1 / 8
కోల్‌కతా దుర్గా పూజ: కోల్‌కతాలో దసరా దుర్గా పూజ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే గొప్ప వేడుక. నగరం అంతా మండపాలతో అలంకరించబడి ఉంటుంది, ప్రతి ఒక్క మండపం ఒక ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని వర్ణిస్తుంది. భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, విందులలో పాల్గొంటారు. నవరాత్రి చివరి రోజున అంటే విజయదశమి రోజున దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో నవరాత్రి ముగుస్తుంది. దీనిలో ఒక ముఖ్యమైన ఆచారం సింధూర్ ఖేలా.. ఇది దుర్గా పూజ చివరి రోజు విజయదశమి రోజున వివాహిత మహిళలు నిర్వహించే ఆనందకరమైన,  బెంగాలీ ఆచారం. ఒకరి ముఖాలకు ఒకరు సింధూరం (కుంకుమ) పూసుకుంటారు.

2 / 8
అహ్మదాబాద్ రావణ దహనం: అహ్మదాబాద్ దసరా వేడుకలను రావణ దహనం అనే గొప్ప దృశ్యంతో జరుపుకుంటుంది. ఇక్కడ రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీతం , నృత్యాలు ఉంటాయి. ఇవి పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తాయి. దహనం చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. నగర ఉత్సవాల్లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ.

3 / 8
ఢిల్లీ రాంలీలా, రావణ దహనం: దేశ రాజధాని ఢిల్లీలో దసరా పండుగ సందర్భంగా రామాయణంలోని దృశ్యాలను ప్రదర్శించే విస్తృతమైన రామ్‌లీలా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ప్రదర్శనలు దుష్టత్వాన్ని నాశనం చేయడాన్ని సూచిస్తూ రావణుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేయడంతో ముగుస్తాయి. ఈ వేడుకలతో పాటు బాణసంచా కాల్చడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షిస్తాయి.

4 / 8
మైసూర్ దసరా: మైసూరులో దసరా వేడుకలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. విజయ దశమి రోజున చాముండేశ్వరీదేవి ని పూజిస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది.  నవరాత్రి  పదిరోజులు జరిగే, పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు దేశంలోని పర్యాటకులనే కాక, విదేశీయులనూ ఆకట్టుకోవడం విశేషం. ముఖ్యంగా జంబూ సవారీ , రాజ దర్భార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

5 / 8
బస్తర్, ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో 75 రోజులు పాటు జరిగే బస్తర్ దసరా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ వేడుకలు దంతేశ్వరి దేవతకు అంకితం చేయబడతాయి. వీటిలోనే గిరిజన వేడుకలు ఉంటాయి. దివాన్ (ముఖ్యమంత్రి)కి అధికారాన్ని ప్రతీకాత్మకంగా బదిలీ చేయడం వంటివి ఉంటాయి. ఈ వేడుకలో కవాతులు, సాంప్రదాయ నృత్యాలు, పురాతన ఆయుధాల పూజలు ఉంటాయి. ఈ ఉత్సవంలో రథయాత్ర, స్థానిక గిరిజన సంస్కృతులు , స్థానిక దేవతలకు ప్రత్యేక పూజలను కలుపుకొని ప్రకృతి , భూమి-కేంద్రీకృత సంప్రదాయాల పట్ల స్థానికులకు ఉన్న భక్తి, గౌరవాన్ని తెలియజెస్తాయి.

6 / 8
బొమ్మల కొలువు - తమిళనాడు: తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో దసరా వేడుకలను బొమ్మల కొలువు అనే ఆచారంతో జరుపుకుంటారు, ఇక్కడ కుటుంబాలు.. మెట్లు ఏర్పాటు చేసి.. ఆ మెట్లమీద రకరకాల బొమ్మలను ప్రదర్శిస్తారు. ఈ బొమ్మల్లో పురాణ కథనాలు, దైనందిన జీవిత దృశ్యాలు వంటి విభిన్న ఇతివృత్తాలను సూచిస్తాయి. ఈ సంప్రదాయం సాంస్కృతిక ప్రదర్శనలు, కథ చెప్పడం, ప్రసాదం పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి.

7 / 8
కులు దసరా: హిమాచల్ ప్రదేశ్‌లో జరుపుకునే కులు దసరా కూడా వెరీ వెరీ స్పెషల్. దసరా నుంచి వారం రోజుల పాటు జరిగే ఉత్సవం. ఉత్సాహభరితమైన ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రసిద్ధి చెందింది. ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా.. ఇక్కడ దసరా వేడుకలు విజయదశమి రోజున ప్రారంభమై చాలా రోజులు కొనసాగుతుంది. స్థానిక దేవత రఘునాథుడిని భారతదేశం అంతటా పర్యాటకులు.. భక్తులను ఆకర్షిస్తూ ఒక గొప్ప ఊరేగింపులో తీసుకువెళతారు.

8 / 8
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?

100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..

మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు