- Telugu News Photo Gallery Vastu Tips: These are the items that should not be kept in the house during Diwali
వాస్తు టిప్స్ : దీపావళి సమయంలో ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలా?
దీపావళి పండుగ వచ్చేస్తుంది. దీంతో ఇప్పటి నుంచి చాలా మంది దీపావళి పండగ కోసం పనులు ప్రారంభించారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి పండగకు ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసివేయడం వలన అదృష్టం కలిసి రావడమే కాకుండా, ఇంట్లో ఆనందాలు వెల్లివిరిస్తాయంట. ఇంతకీ దీపావళి పండగ రోజు ఇంటి నుంచి ఎలాంటి వస్తువులు తీసివేయాలో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 01, 2025 | 7:20 PM

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న పగిలిన గాజు లే దా పాత్రలను తీసివేయాలంట. ఎందుకంటే? పగిలిన గాజు లేదా పాత్రలు ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. ఇది కుటుంబ సభ్యులపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, దీపావళికి ముందు ఇంట్లో నుండి అటువంటి విరిగిన వస్తువులన్నింటినీ తీసివేయాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

కొంత మంది పనిచేయని గడియారాలను అలానే ఉంచేస్తుంటారు. అయితే పని చేయని గడియారాలు ఇంట్లో ఉంటే తొలిగించాలంట. ఎందుకంటే? ఇది ఇంటిలోపల అనేక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు.

పాత, విరిగిన లేదా దెబ్బతిన్న ఫర్నిచర్ ఇంటి సానుకూల శక్తిని బలహీనపరుస్తుంది. అంతే కాకుండా ఇంటిలోనికి వచ్చే, అదృష్టం, శ్రేయస్సును అడ్డుకుంటుంది. అందువలన అలాంటివి ఇంట్లో ఉంటే దీపావళికి ముందే తీసివేయాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

దీపావళికి ముందు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రపరిచి లక్ష్మీ పూజ చేస్తుంటారు. అందువలన పండుగకు ముందు పూజా మందిరంలో ఉన్న విరిగిన దేవతల విగ్రహాలు , పటాలు తొలిగించాలంట.

పాత లేదా దెబ్బతిన్న ఇనుప పాత్రలు, ఉపకరణాలు , లోహం ఇంట్లో శని, రాహువు ప్రతికూల ప్రభావాలను పెంచుతాయి. దీపావళికి ముందు వీటిని తీసివేయడం శుభప్రదం.



