- Telugu News Photo Gallery Jupiter transit brings good luck to those born under the four zodiac signs
బృహస్పతి సంచారం.. వీరికి అనుకోని లాభాలు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా గ్రహాల సంచారం లేదా గ్రహల కలియక 12 రాశులపైతీవ్ర ప్రభావం చూపెడుతుంది. గ్రహలసంచారం కొన్ని రాశులకు అదృష్టం తీసుకొస్తే మరికొన్ని రాశులకు అనక సమస్యలను తీసుకొస్తుంది.
Updated on: Oct 02, 2025 | 7:10 PM

అయితే గ్రహాల్లోకెల్లా శక్తివంతమైన బృహస్పతి గ్రహాం సంచారం చేయనుంది. అక్టోబర్ 19న ఇది గ్రహ సంచారం చేయనుంది. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లాబంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మీన రాశి : మీన రాశి వారికి బృహస్పతి సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థికంగా బాగుటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి గత కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుటుంది. బృహస్పతి సంచారం వలన అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు.

కుంభ రాశి : కుంభ రాశి వారికి బృహస్పతి సంచారం వలన అనేక ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారు అప్పుల ఊబి నుంచి బయటపడి చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఈ సమయంలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో వీరికి మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.



