Water after Meals: భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా? మీకీ విషయం చెప్పాల్సిందే..
చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే మరి కొంతమంది భోజనం తర్వాత చాలా నీరు తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అసలు నీళ్లు ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి క్లారిటీ ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం..
Updated on: Oct 02, 2025 | 8:16 PM

చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే మరి కొంతమంది భోజనం తర్వాత చాలా నీరు తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అసలు నీళ్లు ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి క్లారిటీ ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం..

చాలా మందికి భోజనం చేసే ముందు లేదా భోజనం తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే జీర్ణశక్తి తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం హానికరం. భోజనం చేసేటప్పుడు కొంచెం నీళ్లు తాగాలి. అదే భోజనానికి ముందు కొంచెం నీళ్లు తాగడం వల్ల మీరు తక్కువ తినడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అతిగా తినకుండా నిరోధించవచ్చు.

భోజనానికి ముందు నీళ్లు తాగడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే భోజనం తర్వాత నీళ్లు తాగకూడదు. దీనివల్ల మీరు తిన్న ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు వస్తాయి.

బరువు తగ్గాలనుకుంటే, భోజనానికి ముందు నీళ్లు తాగాలి. దీనివల్ల మీరు ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు. అయితే తిన్న తర్వాత నీళ్లు తాగడం మానుకోవాలి. ఇలా చేస్తే బరువు తగ్గడానికి బదులు మరికాస్త పెరుగుతారు.