Lunar Eclipse: ఈ ఏడాదిలో ఫస్ట్ చంద్రగ్రహణం.. ఎప్పుడు ఏర్పడనుందంటే..? మనదేశంలో దీని ప్రభావం ఎంత అంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం కారణంగా రాశుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే, ఈ మార్పు కొందరికి శుభాలను కలిగిస్తే.. ఇంకొందరికి ఇబ్బందులు తెస్తాయి. గ్రహణం సంభవించినప్పుడు సూతకాల కాలం కూడా అదే సమయంలో ప్రారంభమవుతుంది.

గ్రహణాలకు సంబంధించి హిందూమతంలో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అశుభ చర్యగా పరిగణించబడుతుంది. గ్రహణం మనుషుల జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, జీవితంలో సమస్యలకు కూడా కారణమవుతుందని కూడా నమ్ముతారు. శాస్త్రీయ దృక్కోణంలో.. గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే.. భూమి సూర్యుడు, చంద్రుని మధ్య జరిగే ఒక చర్య.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం కారణంగా రాశుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే, ఈ మార్పు కొందరికి శుభాలను కలిగిస్తే.. ఇంకొందరికి ఇబ్బందులు తెస్తాయి. గ్రహణం సంభవించినప్పుడు సూతకాల కాలం కూడా అదే సమయంలో ప్రారంభమవుతుంది. హిందూ మత పరమైన దృక్కోణంలో.. గ్రహణ సమయంలో ఎటువంటి పని చేయకూడదు. ముఖ్యంగా ఏదైనా శుభకార్యాన్ని తలపెట్టరాదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే.. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం శుక్రవారం మే 5, 2023న ఏర్పడనుంది. ఈసారి చంద్రగ్రహణం పెనుంబ్రల్ చంద్ర గ్రహణం కాబోతోంది. గ్రహణం మే 5న సాయంత్రం 08:45 గంటలకు ప్రారంభమవుతుంది. మే 06న 01:00 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుందని నమ్మకం. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక గ్రహణ సమయం సూతకంగా పరిగణించబడదు.




పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అంటే ఏమిటి భూమి నీడ చంద్రునిపై పడనప్పుడు దానిని పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అంటారు. గ్రహణం సంభవించే ముందు చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వస్తుంది.. సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. ఈ సమయంలో భూమిపై నివసిస్తున్నవారికి చంద్రుడు కనిపించడు. దీనిని చంద్ర గ్రహణం అంటారు. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అంటే చంద్రుని నీడ అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ అస్పష్టతను సాధారణంగా చూడలేము.. కనుక ఈ గ్రహణాన్ని పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)




