Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi Sai Baba: షిర్డీ సాయి భక్తులకు గుడ్ న్యూస్.. దండలు, పూల సమర్పణపై నిషేధం ఎత్తివేత..

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత రెండేళ్ల క్రితం సాయి ఆలయానికి పూలు, దండలు, నైవేద్యాలు తీసుకురావడంపై నిషేధం విధించారు. అప్పడు విధించిన నిషేధం నేటికీ కొనసాగుతోంది. ఈ నిషేధం కారణంగా షిర్డీకి చెందిన వందలాది పూల వ్యాపారులతో పాటు చుట్టుపక్కల దాదాపు 400 ఎకరాల్లో పూల సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు

Shirdi Sai Baba: షిర్డీ సాయి భక్తులకు గుడ్ న్యూస్.. దండలు, పూల సమర్పణపై నిషేధం ఎత్తివేత..
Shirdi Sai Baba
Follow us
Surya Kala

|

Updated on: Apr 23, 2023 | 10:01 AM

షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది సంస్థాన్ ట్రస్ట్. సాయిబాబాకు పూలు, దండలు, ప్రసాదం తీసుకుని వెళ్లడంపై ఉన్న నిషేధం తొలగిపోయింది. ఇక నుంచి సాయి భక్తులు గుడికి వెళ్లేటప్పుడు దండలు, పూలు, ప్రసాదాలు తీసుకుని వెళ్ళవచ్చు. ఇందుకు అనుమతిస్తూ సాయి సంస్థాన్ నిర్ణయం తీసుకుంది.  సాయి సంస్థాన్ ద్వారా భక్తులకు సరసమైన ధరలకు పూలను విక్రయించనున్నారు. రైతుల నుంచి నేరుగా పూలను కొనుగోలు చేసి ఆలయ ప్రాంగణంలో సాయి భక్తులకు పుష్పాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇలా చేయడం వలన ఒకవైపు రైతులకు మరోవైపు భక్తులకు లాభదాయకం ఉంది. సాయి భక్తుల నుంచి జరుగుతున్న దోపిడి ఆగిపోవడంతో పాటు రైతులకు కూడా శ్రమకు తగిన ధర లభిస్తుంది.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత రెండేళ్ల క్రితం సాయి ఆలయానికి పూలు, దండలు, నైవేద్యాలు తీసుకురావడంపై నిషేధం విధించారు. అప్పడు విధించిన నిషేధం నేటికీ కొనసాగుతోంది. ఈ నిషేధం కారణంగా షిర్డీకి చెందిన వందలాది పూల వ్యాపారులతో పాటు చుట్టుపక్కల దాదాపు 400 ఎకరాల్లో పూల సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎనిమిది నెలల క్రితం నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, వ్యాపారులు ఆలయ ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు.

నిషేధాన్ని తొలగించాలని పూల రైతులు, వ్యాపారులు, భక్తులు డిమాండ్   ఈ విషయంపై పరిష్కారం కనుగొనడానికి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పూలమాలలు, పూలు, ప్రసాదాలు సమర్పించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సాయి భక్తులు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అధ్యయన కమిటీ ఒక నివేదికను రూపొందించింది. నిషేధాన్ని ఎత్తివేయడానికి సాయి సంస్థాన్ చొరవ తీసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించి దరఖాస్తును కోర్టులో దాఖలు చేసింది. సాయి సంస్థాన్ తమ నిర్ణయాన్ని ఆమోదించాలని కోర్టులో సివిల్ దరఖాస్తును దాఖలు చేసి కోర్టు నుండి అనుమతి పొందింది. దీంతో కరోనా కాలంలో ప్రారంభమైన ఈ ఆంక్షలు ఎత్తివేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు సాయి సంస్థాన్ తాత్కాలిక కమిటీ నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇందువల్ల సాయిబాబాకు ఇక నుంచి భక్తులు పూలు, దండలు సమర్పించవచ్చు. ఆలయం లోపల సాయికి పువ్వులు, దండలు, నైవేద్యాలను తీసుకొని వెళ్లి సమర్పించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..