AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandanotsavam: వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..

చందనోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. చందనోత్సవం సందర్భంగా తెల్లవారు జామునుంచే దర్శనాలు మొదలయ్యాయి. మూడు గంటల నుంచి వైదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు.

Chandanotsavam: వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..
Nija Roopa Darshan
Surya Kala
|

Updated on: Apr 23, 2023 | 7:28 AM

Share

సింహాచల క్షేత్రంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి విజయ ప్రదాతకు వైశాఖ శుద్ధ తదియనాడు చందనసేవ జరుగుతుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని, భక్తులపై చల్లని చూపులను ప్రసరింప చేసే దేవుడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. చందనోత్సవం సందర్భంగా తెల్లవారు జామునుంచే దర్శనాలు మొదలయ్యాయి. మూడు గంటల నుంచి వైదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. అప్పన్న నిజరూపాన్ని తొలి దర్శనం చేసుకున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ, YV సుబ్బారెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మరో మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు.

ఏడాదికోసారి జరిగే సింహాద్రి అప్పన్న చందనోత్సవం కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. స్వామివారి నిజ స్వరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. జనం తెల్లవారుజామునే భారీగా తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల బారీకేడ్లు ఏర్పాటు చేసి.. పరిస్థితిని చక్కదిద్దారు.

ఆనవాయితీ ప్రకారం టీటీడీ తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చందనోత్సవానికి ఏర్పాట్లు చేశామంటున్నారు మంత్రి అమర్నాథ్.

ఇవి కూడా చదవండి

నిజరూపంలో స్వామివారు వరాహ ముఖం.. మానవ దేహం, సింహపు తోక, జూలుతో వుంటాడు. కుడిచేతి వేలితో గరుత్మంతుడికి అమృతం తాగిస్తూ ఎడమచేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు. స్వామివారి పాదాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..