Mars transit: త్వరలో కర్కాటక రాశిలో అడుగు పెట్టనున్న కుజుడు.. ఈ మూడు రాశులు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి

ప్రస్తుతం అంగారకుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు.  మే 10న కర్కాటక రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. చంద్రుడి రాశి అయిన ఆ రాశిలో జూలై 01 వరకు కుజుడు సంచరించనున్నాడు. ఆ తర్వాత సిమ్హరాశిలోకి అడుగు పెట్టనున్నాడు.

Mars transit: త్వరలో కర్కాటక రాశిలో అడుగు పెట్టనున్న కుజుడు.. ఈ మూడు రాశులు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి
Mangal Gochar
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2023 | 8:32 AM

జ్యోతిష్యశాస్త్రంలో అంగారకుడి పాత్ర చాలా ముఖ్యమైనది. అంతేకాదు గ్రహాల కమాండర్ గా పిలుస్తారు. అంగారకుడిని  ధైర్యం, సాహసాలకు కారకుడిగా భావిస్తారు. కుజుడి గమనంలో చిన్న మార్పు కూడా మనుషుల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ప్రస్తుతం అంగారకుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు.  మే 10న కర్కాటక రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. చంద్రుడి రాశి అయిన ఆ రాశిలో జూలై 01 వరకు కుజుడు సంచరించనున్నాడు. ఆ తర్వాత సిమ్హరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం వలన కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

కన్య రాశి: ఈ రాశి వారికి కుజుడు సంచారం మేలు చేస్తుంది. ఈ రాశివారు జాతకంలో 11వ ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో ఈ రాశీవ్యక్తుల కోరికలు నెరవేరతాయి. ఇప్పటి వరకూ వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి. ఆర్ధికంగా లాభాలు పొందుతారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంది. అయితే ఈ రాశి వ్యక్తుల వివాహ జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

కుంభ రాశి: ఈ రాశి వ్యక్తుల జాతకంలో ఆరో ఇంట్లో అంగారకుడు సంచానున్నాడు. దీంతో ఈ రాశీవ్యక్తులు ఏరంగంలో ఉన్నా సక్సెస్ అందుకుంటారు. పనికి తగిన ప్రశంసలు, ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. తమ ఇంటి సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అందుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మీన రాశి: ఈ రాశివారి జాతకంలో ఐదో ఇంట్లో అంగారకుడి సంచారం జరుగుతుంది. ఈ సంచారం  శుభఫలితాలను అందిస్తుంది. అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న స్టూడెంట్స్ కు శుభఫలితాలు అందుకుంటారు. వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)