Employee Astrology: ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు విపరీత రాజయోగం.. వారి దశ తిరిగిపోయినట్టే.. అంతే..!

ఒక నెల రోజుల వ్యవధిలో మూడు శుభ గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఉపాధి, ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాలకు సంబంధించినంత వరకు వ్యక్తిగత జీవితాలలో చెప్పుకోదగిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గురువు, శుక్రుడు, బుధుడు మిత్ర క్షేత్రాలలోకి మారటం తప్పకుండా ఉద్యోగ ప్రపంచంలో మార్పులు తీసుకురావడం జరుగుతుంది.

Employee Astrology: ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు విపరీత రాజయోగం.. వారి దశ తిరిగిపోయినట్టే.. అంతే..!
Employee Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 20, 2023 | 6:56 PM

ఒక నెల రోజుల వ్యవధిలో మూడు శుభ గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఉపాధి, ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాలకు సంబంధించినంత వరకు వ్యక్తిగత జీవితాలలో చెప్పుకోదగిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గురువు, శుక్రుడు, బుధుడు మిత్ర క్షేత్రాలలోకి మారటం తప్పకుండా ఉద్యోగ ప్రపంచంలో మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఈ శుభగ్రహాల రాశి మార్పు వల్ల దాదాపు అన్ని రాశుల వారు ఉద్యోగ పరంగా కాస్తో కూస్తో ప్రయోజనం పొందటం ఖాయమని చెప్పవచ్చు. అయితే, ఇందులో కూడా మేషం, మిధునం, కర్కాటకం, సింహం, తులా, ధనస్సు రాశుల వారు వృత్తి ఉద్యోగాలపరంగా విపరీత రాజయోగాన్ని అనుభవించే అవకాశం ఉంది. శుభగ్రహాలు రాశులు మారడం అన్నది ఈనెల 23వ తేదీ నుంచి గురుగ్రహం మార్పుతో ప్రారంభం అవుతుంది.
మేష రాశి:
ఈ రాశి వారికి గురు, శుక్ర గ్రహాలు అనుకూలమైన స్థానాలలోకి మారబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు ఈ రాశి వారిని తప్పకుండా ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా అందలం ఎక్కిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి, విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. సొంత ఊర్లో కాకుండా దూరప్రాంతాలలో ఉద్యోగాలలో స్థిరపడే అవకాశం కనిపిస్తోంది. చిన్న ప్రయత్నంతో ఉద్యోగంలో పై మెట్టు ఎక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి ఇది ఎంతో అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఈ నెల 23వ తేదీ నుంచి మే నెల 13వ తేదీలోగా ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా తప్పనిసరిగా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది.
మిథున రాశి: 
ఈ రాశి వారు చిన్న ప్రయత్నంతో చక్కని ఉద్యోగ జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ప్రమోషన్ అందుకోవడానికి లేదా అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వివిధ వృత్తుల్లో ఉన్నవారికి కూడా క్షణం తీరికలేని పరిస్థితి ఏర్ప డుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో మెరుగుదల కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశాలకు వెళ్లి సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది.
కర్కాటక రాశి:
వృత్తి ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఈ రాశి వారు ఈ నెల రోజులలో ఎంతో పురోగతి సాధిస్తారని, స్థిరత్వం పొందుతారని చెప్పవచ్చు. వీరి ఉపాధి లేదా ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగ పరంగా కొద్ది కాలంగా ఎదురవుతున్న చిన్నా చితకా సమస్యలన్నీ సునాయాసంగా పరిష్కారం అవుతాయి. స్వదేశంలోని మంచి కంపెనీల నుంచే కాక విదేశీ సంస్థల నుంచి కూడా చక్కని ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం, ఉద్యోగం మారడం కోసం చేస్తున్న ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఈ రాశి వారు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అవుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టెక్నాలజీ నిపుణులు తదితరులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతుంది.
సింహ రాశి:
ఈ రాశి వారికి గురు, శుక్ర, బుధ గ్రహాలు మూడూ అనుకూలంగా మారుతున్నందువల్ల వృత్తి, ఉద్యో గాలపరంగా తప్పకుండా కొన్ని శుభ పరిణా మాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వీరి వృత్తి, ఉద్యోగాలు వీరిని అందలాలు ఎక్కి స్తాయి. ఉద్యోగానికి సంబంధించినంత వరకు వీరి మనసులోని కోర్కెలన్నీ నెరవేరుతాయి. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించినంత వరకు వీరు ఎక్కడ ఎటువంటి ప్రయత్నం చేసినా అది తప్పకుండా సఫలం అవుతుంది. డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారు విపరీతంగా ఆర్జించడం జరుగుతుంది. వారిలోని ప్రతిభ పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించి ప్రోత్సహిస్తారు. మంచి కంపెనీలోకి అధికార బాధ్యతలతో మారే అవకాశం ఉంది.
తులా రాశి:
ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా అధికార యోగం అధికార యోగం పట్టే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా సమాజంలో మంచి గుర్తింపు లభించి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. స్థాన చలనం ద్వారా లేదా బదిలీ ద్వారా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సమయం ఎంతగానో అనుకూలంగా ఉన్నందు వల్ల కొద్దిపాటి ప్రయత్నంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారిలోని ప్రతిభ పాటవాలు, నైపుణ్యాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగ పరంగా చేసే ప్రయాణాలు మంచి గుర్తింపునిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన లేదా కలలుగన్న ఉద్యోగాలు తప్పకుండా లభించే అవకాశం ఉంది.
ధనూ రాశి: 
ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలపరంగా ఇంతకాలంగా ఎదురవుతున్న కొన్ని ఆటంకాలు, చిక్కులు మటుమాయం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకోకుండా అధికారం చేపట్టడం గృహ వాహన సౌఖ్యాలను అనుభవించడం వంటివి అకస్మాత్తుగా జరిగిపోతాయి. ఉద్యో గంలో సరైన మార్పు కోసం ఎదురుచూస్తున్న వారు తప్పకుండా శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. స్వయం ఉపాధి వారు లాభాల బాట పడతారు. వృత్తుల్లో ఉన్న వారికి డిమాండ్ పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాలలో ప్రతిష్టాత్మకమైన కంపెనీలలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో