Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Astro Tips: అరచేతిలో ఈ రేఖ ఉందా.. పెళ్లి, జీవితం, సంపాదన వంటి విషయాలపై అంచనా

హస్తసాముద్రికంలో కొన్ని పంక్తులు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఉదాహరణకు జీవిత రేఖ, విధి రేఖ, సంపద రేఖ, వివాహ రేఖ, రాహు రేఖ అని శాస్త్రం తెలిసిన వారు చెబుతారు. హస్తసాముద్రిక జ్యోతిషశాస్త్రంలో ఒక వ్యక్తి చేతి ఆకారం, అరచేతి రేఖలు మొదలైనవాటిని అధ్యయనం చేయడం ద్వారా.. ఆ వ్యక్తి  భవిష్యత్తుకి సంబంధించిన మంచి చెడులను అంచనా వేస్తారు.

Marriage Astro Tips: అరచేతిలో ఈ రేఖ ఉందా.. పెళ్లి, జీవితం, సంపాదన వంటి విషయాలపై అంచనా
Marriage Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2023 | 7:07 AM

జ్యోతిష్య శాస్త్రంలా.. హస్తసాముద్రికం ద్వారా కూడా తమ భవిష్యత్ ను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.  హస్త సముద్రకం శాస్త్రంలో  రకాల రేఖల వివరణాత్మక వివరణలు ఉన్నాయి. అంతేకాదు భాగ్యరేఖ, వివాహ రేఖలు కూడా చేతిలో ఉంటాయని భవిష్యత్ ను నిర్దేశిస్తాయని భావిస్తారు. చాలా మందికి రెండు వైపులా గీతలుంటాయి. అవి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. హస్తసాముద్రికంలో కొన్ని పంక్తులు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఉదాహరణకు జీవిత రేఖ, విధి రేఖ, సంపద రేఖ, వివాహ రేఖ, రాహు రేఖ అని శాస్త్రం తెలిసిన వారు చెబుతారు. హస్తసాముద్రిక జ్యోతిషశాస్త్రంలో ఒక వ్యక్తి చేతి ఆకారం, అరచేతి రేఖలు మొదలైనవాటిని అధ్యయనం చేయడం ద్వారా.. ఆ వ్యక్తి  భవిష్యత్తుకి సంబంధించిన మంచి చెడులను అంచనా వేస్తారు. ఈ జ్యోతిష్యశాస్త్రానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ఇక్కడ ఉంది.

చేతి జీవిత రేఖ ఒక వ్యక్తి జీవితం గురించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. చేతి జీవిత రేఖ ద్విదిశలో ఉండి..  ఇతర శాఖ బయటకు ఉంటే .. అటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లి శాశ్వతంగా స్థిరపడతారు. అయితే లైఫ్ లైన్ నుండి బయటకు వచ్చే ఇతర శాఖ లోపలికి ఉంటే అటువంటి వ్యక్తులు కొంతకాలం విదేశాల్లో ఉండి.. అక్కడ బాగా డబ్బు సంపాదించిన తర్వాత తిరిగి వస్తారు.

లైఫ్ లైన్ క్రింద కత్తిరించిన రేఖలు వ్యక్తి ఆరోగ్యాన్ని సూచిస్తాయి. ఈ రేఖలు జీవిత రేఖను దాటి ఉంటాయి.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

లైఫ్ లైన్ గీత శాఖలుగా విడిపోయినప్పుడు అది మనిషి వివాహాన్ని కూడా సూచిస్తుంది. జీవిత రేఖ నుండి బయటికి విస్తరించిన రేఖ వ్యక్తి  వివాహం ఆలస్యం అని, పూర్తిగా భిన్నమైన సంస్కృతితో జరుగుతుందని సూచిస్తుంది. అలాంటి వారి జీవనోపాధి కూడా ఇంటికి దూరంగా ఉంటుంది. అదేవిధంగా ఆయుస్సుకు సంబంధించిన రేఖ అంతర్గతంగా ఉంటే.. వివాహం ఇంటి సమీపంలో ఉంటుంది.  అటువంటి వ్యక్తులు ఇంటి దగ్గరే ఉంటూ జీవనోపాధి పొందుతారు.

ఆయుస్సు రేఖ, మధ్య గీతకు భిన్నంగా ఉంటే, అలాంటి వ్యక్తులు సొంతగా పనిని చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించరు. వీరి సామాజిక సర్కిల్ చాలా చిన్నది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)