Ayodhya Ram Mandir: నేడు అయోధ్య రామయ్యకు జలాభిషేకం .. పాక్ సహా వివిధ దేశాల నదుల నుంచి జలం సేకరణ..

ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, చైనా సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి దాదాపు 155 నదుల నుంచి సేకరించిన నీరు ఢిల్లీ నుంచి రామ జన్మ భూమి అయోధ్యకు చేరింది. ఈ నదుల నీటితో నేడు రామ్ లల్లా 'జలాభిషేకం' నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి యోగి. 

Ayodhya Ram Mandir: నేడు అయోధ్య రామయ్యకు జలాభిషేకం .. పాక్ సహా వివిధ దేశాల నదుల నుంచి జలం సేకరణ..
Ayodhya Ram Mandir
Follow us
Surya Kala

|

Updated on: Apr 23, 2023 | 8:52 AM

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు కొలువుదీరనున్న అయోధ్యలో సందడి నెలకొంది. సరయు నది తీరంలో కొలువైన రామయ్యకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు నేడు జలాభిషేకం నిర్వహించనున్నారు. మణిరామ్ దాస్ చావ్నీ ఆడిటోరియంలో జరగనున్న ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బృందం నుండి ‘జల్ కలష్’ని స్వీకరించిన అనంతరం రామయ్యను ఆ నీటితో పూజిస్తారు.

ఈ జలాభిషేకం కోసం రామభక్తుడు విజయ్‌ జొలీ నేతృత్వంలోని బృందం వివిధ  దేశాల్లోని అనేక నదుల నుంచి జలాన్ని సేకరించారు. ఇప్పటికే ఆయా నదుల జలాన్ని సీఎం యోగికి అందించారు. ప్రపంచ దేశాల నదుల నుంచి తీసుకొచ్చిన ఈ పవిత్ర జలం పాత్రల వద్ద ఆయా దేశాల జెండాలు, వాటి పేర్లు, నదుల పేర్లతో కూడిన స్టిక్కర్లు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పలు దేశాల రాయబారులు కూడా పాల్గొంటారు.

ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, చైనా సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి దాదాపు 155 నదుల నుంచి సేకరించిన నీరు ఢిల్లీ నుంచి రామ జన్మ భూమి అయోధ్యకు చేరింది. ఈ నదుల నీటితో నేడు రామ్ లల్లా ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి యోగి.

ఇవి కూడా చదవండి

భారత్ కు పొరుగు దేశాలైన నేపాల్, బాంగ్లాదేశ్ సహా అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, టాంజానియా, నైజీరియా,  బ్రిటన్‌, భూటాన్‌, మాల్దీవులు వంటి అనేక దేశాల్లోని నదులతో పాటు అంటార్కిటికా నుంచి కూడా నీటిని సేకరించి.. భారత్ కు రప్పించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు.

ఈ జలాల్లో పాకిస్థాన్ లో ప్రవహిస్తున్న రావి నది జలం కూడా ఉంది. ఈ నది నీటిని పాకిస్థాన్ లోని హిందువులు సేకరించి.. దుబాయ్ కు పంపించారు. అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకుంది. అక్కడ నుంచి ఆ జలం అయోధ్యకు చేరుకుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!