Chanakya Niti: ఈ ఒక్క తప్పు.. వ్యక్తి జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది..!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతి శాస్త్రం గ్రంధంలో అనేక అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతి శాస్త్రం గ్రంధంలో అనేక అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే అంశాలన్నీ చాలా స్పష్టంగా వివరించారు. అందులో ఒక వ్యక్తి చేసే తప్పు మాత్రమే అతని వైఫల్యానికి కారణం అవుతుందని, అతని మనస్సుపై నియంత్రణ లేకపోవడమే అతను చేసే తప్పు అని స్పష్టం చేశారు. ఈ తప్పు కారణంగా జరిగే నష్టాలేంటి? ఆచార్య చాణక్య చెప్పిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మనస్సుపై నియంత్రణ లేకపోతే.. ఏ పనిలోనూ నిమగ్నమై ఉండలేరు. అలాంటి వ్యక్తి తెలివితేటలు కలిగి ఉన్నప్పటికీ వృధానే అవుతాయి. తన మనస్సును స్థిరపరచుకోలేకపోవడం వల్ల తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతారు. ఆ పని చేసినా.. ఫలితం ఉండదు. ఇది అతని కాళ్లను అతనే నరుక్కున్నట్లు అవుతుంది.
2. మనస్సు ప్రశాంతంగా లేకపోతే.. వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే మనసును నియంత్రణలో ఉంచుకోవాలి. మనసు నియంత్రణలో లేకపోతే.. ఎంత ధనంతులైనా, చెడు అలవాట్ల బారిన పడకుండా ఎవరూ ఆపలేరు. ఈ కాణంగా జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
3. మనసు నియంత్రణలో లేని వ్యక్తులు ఎప్పుడూ సంతృప్తి చెందలేరు. అలాగే సంతోషంగానూ ఉండలేరు. పైగా ఇతరుల సంతోషాన్ని చూసి అసూయ పడుతుంటారు. అలా నిరాశానిస్పృహలకు లోనవుతారు. కొన్నిసార్లు ఈ నిరాశ కారణంగా జీవితంలో చాలా కోల్పోతారు.
4. ఎవరి మనస్సు అదుపులో ఉండవో.. వారు మనుషుల మధ్య ఉన్నప్పటికీ లేనట్లుగానే ఉంటారు. ఇలాంటి వారు ఇతరులతో కలిసి ఉండలేరు.. ఒంటరిగానూ సంతృప్తి చెందలేరు. అందుకే జీవితంలో విజయం సాధించడానికి, ఏ పనిని అయినా విజయవంతంగా పూర్తి చేయడానికి ముందుగా మనస్సును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రలంలో పేర్కొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..