New Dress Effects: కొత్త డ్రెస్ అని టెంప్ట్ అవుతున్నారా? ఈ విషయం తెలిస్తే మీ గుండె గుభేలే..!

New Dress Effects: షాపింగ్ చేయడం, కొత్త డ్రెస్సులు కొనుక్కొని ధరించడం అంటే చాలా మందికి ఇష్టం. కొంతమంది తరచుగా షాపింగ్స్ చేస్తుంటారు.

New Dress Effects: కొత్త డ్రెస్ అని టెంప్ట్ అవుతున్నారా? ఈ విషయం తెలిస్తే మీ గుండె గుభేలే..!
Dress
Follow us

|

Updated on: Jul 18, 2022 | 10:50 AM

New Dress Effects: షాపింగ్ చేయడం, కొత్త డ్రెస్సులు కొనుక్కొని ధరించడం అంటే చాలా మందికి ఇష్టం. కొంతమంది తరచుగా షాపింగ్స్ చేస్తుంటారు. కొత్త డ్రెస్సులను ధరించడం ద్వారా అందరిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే, ఇది షోకులకు మాత్రమే వర్తిస్తుంది. దీని వెనుక పెద్ద ఆరోగ్య సమస్య దాగి ఉంది. కొత్త బట్టల్లో అనేక వ్యాధులకు కారణమయ్యే క్రిములు, బ్యాక్టీరియా దాగి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కొత్త డ్రెస్సుల వల్ల అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నారు. అయితే, కొత్త బట్టలు తీసుకున్న తరువాత వాటిని ధరించే ముందు.. వాష్ చేయాలి. కొత్త బట్టలు ఉతకకుండా ధరించడం వల్ల కలిగే అనర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంద్రి ట్రయల్ వేసి ఉండొచ్చు.. ఎవరైనా కొత్త దుస్తులు కొనడానికి వెళితే.. ఒకసారి వాటిని ట్రయల్ వేస్తారు. నచ్చితే కొత్తవాటిని కొనుగోలు చేస్తారు. దీని ప్రకారం.. ఎంతో మంది ఆ డ్రెస్సులను ట్రయల్ వేసే ఛాన్స్ ఉంటుంది. కొందరికి చెమట ఎక్కువగా పడుతుంది. ట్రయల్స్ సమయంలో ఆ చెమట దుస్తులకు పడుతుంది. బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఇదే డ్రెస్సులను ఇతరులు వేసుకుంటే.. ఆ బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపిస్తుంది.

ఇన్ఫెక్షన్లకు కారణం.. కొత్త బట్టలు అనేక ఇతర రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఎందుకంటే.. కొత్త డ్రెస్సులు ప్యాక్టరీ నుంచి తయారై నేరుగా అవుట్‌లెట్‌కు చేరుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో, డ్రెస్సులు అనేక చేతులు మారుతుంది. వారిలో ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో చెప్పలేం. అందుకే కొన్న దుస్తులను ఉతికిన తరువాతే బట్టలు వేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

రసాయనాల ఉపయోగం.. కొత్త బట్టలు నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అయితే, బట్టలను ప్యాక్ చేసే సమయంలో పురుగులు రాకుండా కొన్ని రసాయనాలు వాడుతున్నారు. ఆ రసాయనాల వల్ల ఒక రకమైన అలర్జీ రావొచ్చు. అందుకే కొత్త బట్టలు ఉతకడం మంచిది.

రంగులు వేసిన డ్రెస్సులు.. అనేక డ్రెస్సులకు అద్దకం చేస్తారు. ఇలాంటి డ్రెస్సులను ఖచ్చితంగా వాష్ చేయాలి. ఈ డ్రెస్సులను ఉతకకుండా వేసుకుంటే.. ఆ కెమికల్ కలర్స్ శరీరానికి అంటుకుంటాయి. ఆ కారణంగా అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. ఈ డ్రెస్సులను ఉప్పునీటిలో ఉతికి, ధరించాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles