SBI Hikes FD IR: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బిఐ.. ఆ కస్టమర్లకు పండగే ఇక..!
SBI Hikes FD Interest Rates: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిర్దిష్ట కాల వ్యవధిలోని కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను..
SBI Hikes FD Interest Rates: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిర్దిష్ట కాల వ్యవధిలోని కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేట్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పెంచిన వడ్డీ రేట్లు.. రూ. 2 కోట్లు, అంతకంటే ఎక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచడం వల్ల ఎస్‌బిఐ ఎఫ్‌డీ లపై వడ్డీ రేట్లను పెంచింది.
కొత్త వడ్డీ రేట్లు జూలై 15 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన ఎఫ్‌డి రేట్లను ఒక సంవత్సరం నుండి రెండేళ్లలోపు మెచ్యూరిటీ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు పెంచింది. సాధారణ ప్రజల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4.75 శాతం నుండి 5.25 శాతానికి పెంచగా.. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 5.75 శాతానికి పెంచింది. ఇతర టర్మ్ ప్లాన్స్ రేట్లను పెంచలేదు. కాగా, సవరించిన వడ్డీ రేట్లు తాజా డిపాట్లపై, మెచ్యూరింగ్ డిపాజిట్ల పునరుద్ధరణలకు వర్తిస్తాయి. ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు దేశీయ టర్మ్ డిపాజిట్ల రేట్ల ప్రకారం సరి చేయడం జరుగుతుందని ఎస్‌బిఐ వెల్లడించింది. ఇక అన్ని రకాల బల్క్ టర్మ్ డిపాజిట్లకు ప్రీమెచ్యూర్ పెనాల్టీ 1 శాతం ఉంటుంది. పునరుద్ధరణలతో సహా అన్ని కొత్త డిపాజిట్లకు ఇది వర్తిస్తుందని బ్యాంక్ పేర్కొంది.
రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 1. 7 రోజుల నుండి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం 2. 46 రోజుల నుండి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.50 శాతం 3. 180 రోజుల నుండి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం 4. 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం 5. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం 6. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం 7. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం 8. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం.
జూన్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచింది. దాంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఇందులో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పెంపు కూడా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర బ్యాంకులతో సహా ఎస్‌బిఐ కూడా ఎఫ్‌డి వడ్డీ రేట్లను పెంచింది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగానే ఉన్నందున ఆగస్టు MPC సమావేశంలో, RBI తన రెపో రేట్లను మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..