AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. ఆ దెబ్బకు 4 ఏళ్ల రికార్డులు బద్దలు..

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా కీలకమైన సరఫరా మార్గాలు మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో అల్యూమినియం ధరలు గత నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతుంటే, పరిశ్రమలకు కీలకమైన ఈ సిల్వర్ మెటల్ మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. అసలు ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటి? భారత మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?

బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. ఆ దెబ్బకు 4 ఏళ్ల రికార్డులు బద్దలు..
Aluminum Prices Hit 4 Year High
Krishna S
|

Updated on: Mar 09, 2026 | 4:42 PM

Share

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక లోహమైన అల్యూమినియం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడుతుందనే భయాందోళనల మధ్య, సోమవారం అల్యూమినియం ధరలు గత నాలుగు ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అల్యూమినియం ధరల జోరు మామూలుగా లేదు.

  • లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్: మూడు నెలల బెంచ్‌మార్క్ అల్యూమినియం ధర టన్నుకు 3,544 డాలర్లను తాకింది. ఇది మార్చి 2022 తర్వాత అత్యధికం.
  • షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్: ఇక్కడ ధరలు 3.29శాతం పెరిగి 25,310 యువాన్లకు (3,658 డాలర్లకు) చేరుకున్నాయి.
  • భారత మార్కెట్: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో అల్యూమినియం ధర 3శాతం పెరిగి రూ.350.90 వద్ద ట్రేడ్ అవుతోంది.

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు

ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో సుమారు 9శాతం వాటా కలిగిన కీలకమైన గల్ఫ్ జలమార్గం హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం కలగడం ప్రధాన కారణం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ఈ మార్గాన్ని ప్రమాదంలో పడేసింది. ఖతార్‌కు చెందిన ఖతాలమ్ స్మెల్టర్ తన ఉత్పత్తిని తగ్గించడం, అలాగే అల్యూమినియం బహ్రెయిన్ షిప్‌మెంట్‌లపై ఫోర్స్ మేజర్ ప్రకటించడంతో మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. అల్యూమినియం తయారీకి భారీగా విద్యుత్ అవసరం. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం కలిగితే, స్మెల్టర్ల పనితీరు దెబ్బతింటుందనే ఆందోళన నెలకొంది.

బంగారం, వెండి ధరల్లో భిన్నమైన ధోరణి

సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ బలంగా ఉండటంతో బులియన్ మార్కెట్ ఒత్తిడికి లోనైంది. బంగారం, వెండి ధరలు దాదాపు 3.5శాతం వరకు పతనమవ్వడం గమనార్హం. ప్రస్తుతం MCXలో బంగారం ధర రూ.1.61 లక్షల కంటే తక్కువకు పడిపోయింది.

మున్ముందు ధరలు ఎలా ఉండవచ్చు?

కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడు అనింద్య బెనర్జీ అభిప్రాయం ప్రకారం.. మధ్యప్రాచ్యం ఏటా 65 లక్షల టన్నుల అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. సరఫరా గొలుసులో ఇబ్బందులు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో అల్యూమినియం ధర టన్నుకు 3,800 డాలర్ల నుండి 4,000 డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది అని ING కమోడిటీ స్ట్రాటజిస్ట్ ఎవా మాంథే అంచనా వేశారు. నిర్మాణ రంగం, ప్యాకేజింగ్, ఆటోమొబైల్ పరిశ్రమల్లో అల్యూమినియం వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ధరల పెరుగుదల ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Follow Us
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. ఆ దెబ్బకు 4 ఏళ్ల..
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. ఆ దెబ్బకు 4 ఏళ్ల..
సెమీస్, ఫైనల్స్‎లో శివతాండవం..సంజూకు ఎంత గిట్టిందో తెలుసా ?
సెమీస్, ఫైనల్స్‎లో శివతాండవం..సంజూకు ఎంత గిట్టిందో తెలుసా ?
మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం ప్రారంభం
మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం ప్రారంభం
ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.?
ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.?
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!