AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల్లో టికెట్ లభించలేదు, పీ.సీ .థామస్ నేతృత్వంలోని ‘కేరళ కాంగ్రెస్’ అలక, ఎన్డీయేకి గుడ్ బై

కేరళ ఎన్నికల్లో పీ.సీ.థామస్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ కి   టికెట్లు లభించలేదు. దీంతో ఈ వర్గం ఎన్డీయేకి గుడ్ బై చెప్పింది.  ఏప్రిల్ 6 న జరిగే ఎన్నికలకు బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి తమకు ఒక్క సీటైనా కేటాయించలేదని మాజీ కేంద్ర మంత్రి పీ.సి.థామస్ ఆరోపించారు.

ఎన్నికల్లో టికెట్ లభించలేదు,  పీ.సీ .థామస్ నేతృత్వంలోని 'కేరళ కాంగ్రెస్'  అలక, ఎన్డీయేకి గుడ్ బై
Pc Thomas
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 17, 2021 | 3:50 PM

Share

కేరళ ఎన్నికల్లో పీ.సీ.థామస్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ కి   టికెట్లు లభించలేదు. దీంతో ఈ వర్గం ఎన్డీయేకి గుడ్ బై చెప్పింది.  ఏప్రిల్ 6 న జరిగే ఎన్నికలకు బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి తమకు ఒక్క సీటైనా కేటాయించలేదని మాజీ కేంద్ర మంత్రి పీ.సి.థామస్ ఆరోపించారు.  తమను ఈ కూటమి పక్కన బెట్టిందని కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక తాముసీనియర్ నేత పీ.జే.జోసెఫ్ నాయకత్వాన గల  కేరళ కాంగ్రెస్ లో విలీనమవుతామని ఆయన చెప్పారు. (ఈ వర్గం యూడీఎఫ్ లో భాగంగా ఉంది).  2016 లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ 4 సీట్లకు పోటీ చేసిందని, కానీ ఈ సరి తమకు పార్టీ మొండిచెయ్యి చూపిందని థామస్ అన్నారు. పాలా నియోజకవర్గం నుంచి పోటీ చేయవలసిందిగా బీజేపీ తనను కోరిందని, అయితే తన కుమారుడితో క్యాన్సర్ లక్షణాలు కనబడినందున తాను ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టలేనని తెలిపానని ఆయన చెప్పారు.  మేము కోరిన ఇతర స్థానాలను ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ నిరాకరించిందని ఆయన తెలిపారు. దీంతో ఇక వైదొలగాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. 2004 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో థామస్..మువత్తుపుల  నియోజకవర్గం నుంచి  ఎన్డీయే టికెట్ పై పోటీ  చేసి గెలుపొందారు.

లోగడ ఏబీ వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఆయన న్యాయశాఖ సహాయ  మంత్రిగా వ్యవహరించారు.

తమిళనాడు ఎన్నికల్లో  డీఎంకే అభ్యర్థి భలే హామీ

ఇలా ఉండగా తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఒకరు భలే హామీ ఇఛ్చారు.  తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో ఇసుక మైనింగ్ కి అనుమతులిస్తామని సెంథిల్ బాలాజీ అనే అభ్యర్థి కొత్త వాగ్దానం చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా దీన్ని అడ్డుకున్న పక్షంలో ఆ అధికారిని తొలగిస్తామని ఆయన చెప్పారు. డీఎంకే నేత స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేసిన 5 నిముషాల్లోనే ఈ చర్య తీసుకుంటామన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తాం.. ఉభయ సభలనుద్ధేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

MiG-21 Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి.. విచారణకు ఆదేశించిన వాయుసేన