AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MiG-21 Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి.. విచారణకు ఆదేశించిన వాయుసేన

MiG-21 crashes: భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్‌ విమానం బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ గ్రూప్‌ కెప్టెన్‌

MiG-21 Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి.. విచారణకు ఆదేశించిన వాయుసేన
Mig 21 Crash
Shaik Madar Saheb
|

Updated on: Mar 17, 2021 | 3:51 PM

Share

MiG-21 crashes: భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్‌ విమానం బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ గ్రూప్‌ కెప్టెన్‌ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఇండియాలోని ఓ వైమానిక స్థావరం నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా బయల్దేరిన విమానం.. కొద్దిసేపటికే ప్రమాదానికి గురై కుప్పకూలింది. ఈ ఘటనలో గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్త మృతి చెందినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ను షేర్‌ చేసింది.

ఈ ఘోర ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల ఐఏఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.. బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం అంటూ ట్విట్‌ చేసింది.

ఇదిలాఉంటే.. ఈ ఏడాది జనవరిలో కూడా రాజస్థాన్‌ బసూరత్‌గఢ్‌లో ఇదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మిగ్-21 యుద్ధ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. గత 18 నెలల్లో మిగ్‌-21 విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. అయితే ఈ సంఘటన గ్వాలియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో చోటు చేసుకున్నట్లు సమాచారం.

Also Read:

Elderly Woman Dies: కొడుకే కడతేర్చాడు.. చెంపదెబ్బకు ప్రాణం కోల్పోయిన తల్లి.. వీడియో

సాయుధ పోరాటం వదిలి శాంతిమంత్రం… మావోయిస్టుల కొత్త రూట్.. ఎందుకో.. మరెందుకో…!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!