AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elderly Woman Dies: కొడుకే కడతేర్చాడు.. చెంపదెబ్బకు ప్రాణం కోల్పోయిన తల్లి.. వీడియో

Delhi Elderly Woman Death: నవమాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచిన కుమారుడే.. ఆ తల్లికి కాలయముడిగా మారాడు. చివరకు కుమారుడి చేతిలోనే ఆ తల్లికి నూరేళ్లు నిండాయి. కుమారుడు కొట్టిన చెంపదెబ్బకు తల్లి

Elderly Woman Dies: కొడుకే కడతేర్చాడు.. చెంపదెబ్బకు ప్రాణం కోల్పోయిన తల్లి.. వీడియో
Elderly Woman Dies By Son
Shaik Madar Saheb
|

Updated on: Mar 17, 2021 | 2:38 PM

Share

Delhi Elderly Woman Death: నవమాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచిన కుమారుడే.. ఆ తల్లికి కాలయముడిగా మారాడు. చివరకు కుమారుడి చేతిలోనే ఆ తల్లికి నూరేళ్లు నిండాయి. కుమారుడు కొట్టిన చెంపదెబ్బకు తల్లి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో నివసించే అవతార్ కౌర్ (76) కు పక్కింట్లో నివసించే వారితో పార్కింగ్‌ విషయంలో సోమవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. దీంతో ఈ విషయం కాస్త పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లింది. పక్కింటి వారు అవతార్‌ కౌర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అవతార్‌పై కుమారుడు రణ్‌బీర్‌కు కోపం వచ్చింది.

దీనికి సంబంధించి ఇంటి బయట అవతార్‌కు, రణ్‌బీర్‌కు, అతని భార్యకు మధ్య కొంతసేపు చర్చ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రణ్‌బీర్ అవతార్‌ను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అమె అక్కడిక్కడే కుప్పకూలి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె కోడలు లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే అవతార్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు రణ్‌బీర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను మీరు కూడా చూడండి.

సాయుధ పోరాటం వదిలి శాంతిమంత్రం… మావోయిస్టుల కొత్త రూట్.. ఎందుకో.. మరెందుకో…!

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్