ఒకరి ప్రాణం కోసం ప్రయత్నించారు.. మరో నలుగురు ప్రాణాలు విడిచారు.. విషాదం నింపిన సెప్టిక్ ట్యాంక్
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. విధి వక్రీకరించి ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో పడిన చిన్నారిని కాపడటం కోసం ప్రయత్నించిన..
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. విధి వక్రీకరించి ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో పడిన చిన్నారిని కాపడటం కోసం ప్రయత్నించిన మరో నలుగురు కూడా మరణించారు. వీరిలో ఇద్దరు మైనర్లు కావడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే ఆగ్రా ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపూర్ గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి అనురాగ్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. బాలుడిని కాపాడటం కోసం వెళ్లిన మరో నలుగురు కూడా మరణించారు.
బాలుడిని రక్షించడానికి సోము, రామ్ ఖిలాడితో సమా హరిమోన్(16), అవినాశ్(12) అనే ఇద్దరు మైనర్లు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. చిన్నారి అనురాగ్‌ని కాపడటం కోసం ప్రయత్నించి మృత్యువాత పడ్డారు. వీరిలో అవినాశ్, అనురాగ్, హరిమోన్ ముగ్గురు సోదరులు. గ్రామస్తులు వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వీరంతా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మరణించిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.
Read More: