మమత ఆరోపణలపై ఈసీ ఆగ్రహం, ఏ రాజకీయ పార్టీకీ తాము సన్నిహితం కాదని స్పష్టీకరణ
ఒక రాజకీయపార్టీకి తాము సన్నిహితులమన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలను ఎలెక్షన్ కమిషన్ కొట్టిపారేసింది. తాము ఏ రాజకీయ పార్టీ పట్లా పక్షపాతం చూపడంలేదని స్పష్టం చేసింది.
ఒక రాజకీయపార్టీకి తాము సన్నిహితులమన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలను ఎలెక్షన్ కమిషన్ కొట్టిపారేసింది. తాము ఏ రాజకీయ పార్టీ పట్లా పక్షపాతం చూపడంలేదని స్పష్టం చేసింది.కోల్ కతా లోను, ఢిల్లీ లోను పొలిటికల్ పార్టీలతో తాము సమావేశమయ్యామని మమత ఆరోపించారని, అయితే ఇది అనుచిత ఆరోపణ అని డిప్యూటీ ఎలెక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ ఆమెకు రాసిన లేఖలో విమర్శించారు. ఆమె ఏదో భ్రమలో ఉన్నారని, సంక్లిష్ట వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందుకు కారణాలేమిటో ఆమెకే తెలియాలని, ఇది దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయపార్టీ పట్ల ప్రత్యేకంగా మేం పక్షపాతం చూపుతున్నామన్న ఆరోపణ అర్థం లేనిదన్నారు. తమకు అన్ని పార్టీలూ సమానమే అని వ్యాఖ్యానించారు తమది స్వతంత్ర వ్యవస్థ అని స్పష్టం చేశారు. .బంకూరా జిల్లాలో నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ.. ఈసీని హోమ్ మంత్రి అమిత్ షా శాసిస్తున్నారని, ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. తన సెక్యూరిటీ డైరెక్టర్ ని ఉన్నపళంగా ఈసీ అధికారులు తొలగించారని, వారికి ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. నన్ను హతమార్చాలనుకుంటున్నారా ? అదే చేస్తే బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అని కూడా ఆమె అన్నారు. ‘అమిత్ షా మా పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు.. ఈసీని తన సొంత సంస్థలా పరిగణిస్తున్నారు’ అని ఆమె దుయ్యబట్టారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ని ఎలాగైనా ఓడించేందుకు ఈసీని వాడుకుంటున్నారని అన్నారు.
బీజేపీ ఎత్తుగడలకు నిరసనగా తాము ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని కూడా మమతా బెనర్జీ హెచ్చరించారు. తాను గాయపడిన పులినని, అలా గాయపడిన బెబ్బులి చాలా ప్రమాదకరమైనదని దీదీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యంగా తమపై ఆమె చేసిన ఆరోపణలను ఈసీ ఖండించింది. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి కావని పేర్కొంది. తమపై ఎవరి పెత్తనం లేదని సుదీప్ జైన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తమపై ఏ రాజకీయ పార్టీకూడా ఈ విధమైన విమర్శలు చేయలేదన్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : కార్తికేయ వర్సెస్ లావణ్య : చావు కబురు చల్లగా టీం ఆడిన క్రికెట్ మ్యాచ్ లో గెలుపెవరిది ?:Chaavu Kaburu Challaga Team Cricket Match Video
శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video