‘నన్ను నాడు సీపీఎం వారు కొట్టారు, ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తోంది’, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బెంగాల్ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ సీఎం  మమతా బెనర్జీ.... బీజేపీపై  తన విమర్శల జోరు పెంచారు. సీపీఎం వారి చేతిలో తాను ఎన్నోసార్లు దెబ్బలు తిన్నానని, తనను వారు కొట్టారని, ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేయడం ప్రారంభించిందని  ఆమె అన్నారు.

'నన్ను నాడు సీపీఎం వారు కొట్టారు, ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తోంది', బెంగాల్ సీఎం మమతా  బెనర్జీ
Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 17, 2021 | 5:41 PM

బెంగాల్ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ సీఎం  మమతా బెనర్జీ…. బీజేపీపై  తన విమర్శల జోరు పెంచారు. సీపీఎం వారి చేతిలో తాను ఎన్నోసార్లు దెబ్బలు తిన్నానని, తనను వారు కొట్టారని, ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేయడం ప్రారంభించిందని  ఆమె అన్నారు.  ఎన్నికల ముందు తాను బయటకి రాకుండా ఈ పార్టీ చూస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఝార్ గ్రామ్ జిల్లాలోని గోపీ వల్లభాపూర్ లో బుధవారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె.. గతంలో సీపీఎం వారు భౌతికంగా తనపై దాడులు చేశారన్నారు.  ఈ ఎన్నికల ముందు నన్ను బయటకు రాకుండా ఈ బీజేపీ చూస్తోంది.. నా కాలిని గాయపరిచింది..కానీ నా గొంతును వాళ్ళు నొక్కలేరు. బీజేపీని ఓడిస్తాం అని మమత అన్నారు.   సీపీఎం వారే ఇప్పుడు బీజేపీ నేతలు, కార్యకర్తలయ్యారని,  కొందరు దేశద్రోహులు, అధికారం కోసం అంగలారుస్తున్నవారు బీజేపీలో చేరారని ఆమె పేర్కొన్నారు. కమలనాథుల జంట విధానాలైన నిషాంనల్ పాపులేషన్ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ గురించి దీదీ ప్రస్తావిస్తూ వారు అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తారని, తన తండ్రి జన్మదిన సర్టిఫికెట్ అడిగితే తాను ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. ఒకప్పుడు పుట్టుకలు ఇళ్లలో జరిగేవని, ఆస్పత్రుల్లో కాదని అనే చెప్పారు. అలాంటప్పుడు సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వస్తాయన్నారు.

కాగా-2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఈ జిల్లా నుంచి 4 సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు  అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు తృణమూల్ కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు- మమతా బెనర్జీ తాను పాల్గొంటున్న ప్రతి ర్యాలీలోనూ తన కాలి గాయాన్ని ప్రస్తావిస్తూ  ఇది బీజేపీ పనే అని చెప్పకనే చెబుతున్నారు. ఆమె ఈ  రకంగా సానుభూతి ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా ఉండగా నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువెందు అధికారి స్థానికుడు కాదని,  ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి: ‘గాడ్ అన్నా గన్స్ అన్నా ఇష్టం,’ జార్జియా కాల్పుల కేసు అనుమానితుడి వెల్లడి, ఆసియా మహిళలనే టార్గెట్ చేశాడట

Sarah Taylor: క్రికెట్‌లో చరిత్ర మారుతుంది.. అబ్బాయిల క్రికెట్ జట్టుకు కోచ్‌గా శివంగిలాంటి అమ్మాయి