‘గాడ్ అన్నా గన్స్ అన్నా ఇష్టం,’ జార్జియా కాల్పుల కేసు అనుమానితుడి వెల్లడి, ఆసియా మహిళలనే టార్గెట్ చేశాడట

జార్జియాలో మూడు వేర్వేరు  మాసేజ్ పార్లర్లలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 8 మందిని పొట్టన బెట్టుకున్న వ్యక్తిని 21 ఏళ్ళ రాబర్ట్ ఆరాన్ లాంగ్ గా గుర్తించారు...

'గాడ్ అన్నా గన్స్ అన్నా ఇష్టం,' జార్జియా కాల్పుల కేసు అనుమానితుడి వెల్లడి, ఆసియా మహిళలనే టార్గెట్ చేశాడట
Robert Aaron Long
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 17, 2021 | 5:33 PM

జార్జియాలో మూడు వేర్వేరు  మాసేజ్ పార్లర్లలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 8 మందిని పొట్టన బెట్టుకున్న వ్యక్తిని 21 ఏళ్ళ రాబర్ట్ ఆరాన్ లాంగ్ గా గుర్తించారు.  మొదట ఇతని కాల్పుల్లో  ఇద్దరు ఆసియన్ మహిళలు, ఒక శ్వేత జాతి మహిళ, మరో శ్వేత జాతీయుడు ఉన్నారు.  మరో రెండు స్పా లలో మొత్తం నలుగురు ఆసియన్ మహిళలు ఇతని కాల్పులకు బలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం రాబర్ట్ తన కారులో పారిపోతుండగా పోలీసులు  సుమారు 3 గంటలపాటు ఛేజ్ చేసి పట్టుకున్నారు.మూడు షూటింగులకూ ఇతడే బాధ్యుడని వారు అనుమానిస్తున్నారు. తనకు గాడ్ (దేవుడు) అన్నా గన్స్ అన్నా ఇష్టమని  రాబర్ట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటన సమాచారం అధ్యక్షుడు జోబైడెన్ కి తెలుసా అన్న విషయాన్ని వైట్ హౌస్ ధ్రువీకరించలేదు. జాతి వివక్షతోనే అతడీ హత్యలకు పాల్పడ్డాడా అన్న విషయం  కూడా ఇంకా తెలియలేదు. తాము దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో ఈ హత్యలకు కారణాన్ని తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారు.  ఇతని బారిన పడిన ఆరుగురు ఆసియన్ మహిళల్లో నలుగురు కొరియాకు చెందినవారని సమాచారం. పోలీసులు దీనిని నిర్ధారించాల్సి ఉంది.

2017 లో రాబర్ట్ సహ విద్యార్ధి అయిన ఒక వ్యక్తి.. తాము చదువుకునేటప్పుడు రాబర్ట్ ఏనాడూ హింసాత్మకంగా ప్రవర్తించలేదని, ఎంతో సౌమ్యంగా ఉండేవాడని తెలిపాడు. అతడు ఇంత దారుణంగా కాల్పులు జరిపి ఇంతమంది ప్రాణాలను బలిగొన్నాడంటే నమ్మలేకపోతున్నామన్నాడు.  అతనికి జాతి వివక్ష వంటి ఉద్దేశాలే లేవని ఆయన చెప్పాడు.  జార్జియాలో ఈ కాల్పుల ఘటన పెను సంచలనం రేపింది. అమెరికాలో పబ్ లు, బార్లు, రెస్టారెంట్లలో ఇలాంటి ఘటనలు జరగడం సహజం. అయితే స్పాలలో ఈ విధమైన దారుణం జరగడం ఇదే మొదటిసారి . తాను ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడో రాబర్ట్ ఇంకా నోరు విప్పడంలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి: Sarah Taylor: క్రికెట్‌లో చరిత్ర మారుతుంది.. అబ్బాయిల క్రికెట్ జట్టుకు కోచ్‌గా శివంగిలాంటి అమ్మాయి

స్పీడ్ పెంచిన ధరణి పోర్టల్‌.. రోజుకు ఎన్ని భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో.. ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..