AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీడ్ పెంచిన ధరణి పోర్టల్‌.. రోజుకు ఎన్ని భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో.. ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..

Dharani Portal : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి,

స్పీడ్ పెంచిన ధరణి పోర్టల్‌.. రోజుకు ఎన్ని భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో.. ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..
Dharani Portal
uppula Raju
|

Updated on: Mar 17, 2021 | 5:22 PM

Share

Dharani Portal : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ విజయవంతంగా దూసుకెళుతుంది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే క్రయ విక్రయాలు చేసుకునే వెసలుబాటు ఉండటంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసినట్లయింది. అయితే ప్రారంభంలో కొన్ని సమస్యలున్నా రోజు రోజుకు ధరణి సైట్‌ను అధికారులు అప్‌డేట్‌ చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం అన్ని పనులు సక్రమంగా నడుస్తుండటంతో ధరణి రికార్డులు క్రియేట్ చేస్తుంది.

తాజాగా ప్రవేశపెట్టిన ‘గ్రీవెన్స్‌ మాడ్యూ ల్‌’, ఇతర గ్రీవెన్స్‌ ఆప్షన్లతో 60 నుంచి 70 భూ సమస్యలకు చెక్‌ పడుతున్నదని అధికారులు చెప్తున్నారు. గ్రీవెన్స్‌ మాడ్యూల్‌తో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు, సర్వే నంబర్‌ మిస్సింగ్‌, విస్తీర్ణం నమోదులో పొరపాట్లు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. దీంతోపాటు దరఖాస్తు స్థితి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?, ఒకవేళ ఆమోదిస్తే భూ యజమాని ఎవరిని సంప్రదించాలి? వంటి వివరాలన్నీ దరఖాస్తుదారు మొబైల్‌ నంబర్‌కు అప్‌డేట్లురానున్నాయి.

ధరణిలో రోజుకు సగటున 3 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. లావాదేవీలు ప్రారంభమైన నవంబర్‌ నెలతో పోల్చితే ఫిబ్రవరిలో రెట్టింపునకు చేరాయి. పోర్టల్‌ ఆధారంగా సేవలు అత్యంత సులభంగా, పారదర్శకంగా, వేగంగా జరుగుతుండటంతోపాటు ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతున్నాయి. ధరణి ప్రారంభమైన మొదటి నెల లో 36,710 రిజిస్ట్రేషన్లు కాగా, 36,920 స్లాట్లు బుక్‌ అయ్యా యి. ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్లు 71,402కాగా, స్లాట్లు 75,327 బుక్‌ అయ్యాయి. మంగళ, శనివారాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో 3 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 3.38 లక్షల లావాదేవీలు జరుగగా. రూ.374 కోట్ల ఆదా యం సమకూరిందని అధికారులు తెలిపారు.

Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్

ఎఫ్ – 3లో వెంకటేశ్ రేచీకటితో అలరించనున్నాడా..? డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం చెబుతున్నాడో తెలుసా..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒడ్డున ఉన్న తిమింగలంపై షార్క్ దాడి.. చివరికి ఏమైందంటే.!

Kajal Agarwal : కమల్ హాసన్ అసంతృప్తిపై కారణాలేంటి..? ఇండియన్-2 పై క్లారిటీ ఇచ్చిన కథానాయిక..