Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్

ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని తిరిగి సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామా అని. రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు సినిమాలకు..

Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్,  పవన్ ఈజ్ బ్యాక్... ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్
Vakeel Saab Review
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 17, 2021 | 4:59 PM

ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని తిరిగి సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామా అని. రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్‌తో తిరిగి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 9న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. సినిమాకు సాధారణ హిట్ టాక్ వచ్చినా, రికార్డులు పేలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది పవన్ ఫ్యాన్స్ ఆరాటం చూస్తుంటే.

ఈ క్రమంలోనే ఈ మూవీపై మరింత బజ్ పెంచారు మోస్ట్ కాంట్రవర్శియల్ ఫిల్మ్ క్రిటిక్,  ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు. తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏంటో చెప్పేశాడు ఇతగాడు. వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్ సాలిడ్ అండ్ టెర్రఫిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేశాడు. ఔట్ స్టాడింగ్ రెస్పాన్స్ ఉందని.. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుందని తన ట్విట్టర్ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని అభిమానులకు మరింత ఉత్కంఠ పెంచాడు. పవర్ స్టార్ బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారంటూ తేల్చేశాడు ఉమైర్ సంధు.

అయితే కొందరు అభిమానులు మాత్రం ఇతగాడి రివ్యూని లైట్ తీసుకోమని చెబుతున్నారు.  గతంలో కాటమరాయుడు, అజ్ఞాతవాసి చిత్రాలకు కూడా విడుదలకు ముందే సాలిడ్ హిట్స్ అంటూ రివ్యూలు ఇచ్చారని… అవి పెద్దగా ఆడలేదని చెబుతున్నాడు. ఇతడు కేవలం తనపై అటెన్షన్ పెంచుకునేందుకు కూడా రివ్యూలు ఇస్తాడని టాక్ ఉంది.

అయితే  వకీల్ సాబ్ సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుటికే టీజర్ సహా పవన్ లుక్‌ అభిమానులతో సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.  ‘పింక్’ మూవీ తెలుగు రీమేక్‌గా ఈ ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల కీ రోల్స్‌లో కనిపించనున్నారు.