AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరు జిల్లాలో ఇంకా గసగసాల స్మెల్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.. డ్రగ్ తయారికి దీన్ని ఎలా వినియోగిస్తారంటే..?

నిషేధిత గసగసాల పంట వెనుకున్న గుట్టునంతా లాగుతున్నారు ఎస్‌ఈబీ అధికారులు. తీగలాగితే అక్రమార్కుల డొంకంతా కదులుతోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లికి

చిత్తూరు జిల్లాలో ఇంకా గసగసాల స్మెల్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.. డ్రగ్ తయారికి దీన్ని ఎలా వినియోగిస్తారంటే..?
Opium Cultivation
Ram Naramaneni
|

Updated on: Mar 17, 2021 | 4:09 PM

Share

నిషేధిత గసగసాల పంట వెనుకున్న గుట్టునంతా లాగుతున్నారు ఎస్‌ఈబీ అధికారులు. తీగలాగితే అక్రమార్కుల డొంకంతా కదులుతోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన రేవంత్‌, నాగరాజు అనే ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఏజెంట్ల ఇళ్లలో జరిపిన సోదాల్లో రెండు బస్తాల గసగసాల విత్తనాలు బయటపడ్డాయి. ముంబయి డ్రగ్ మాఫియా నుంచి విత్తనాలు తెచ్చి రైతులతో పంట వేయిస్తున్నట్టు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారుల పాత్రపైనా అరాతీస్తున్నారు. అరెస్ట్‌ అయిన నిందితుల ద్వారా ముంబయి లింకులను రాబట్టే పనిలో ఉంది ఎస్‌ఈబీ. ఇప్పటికే డ్రోన్‌ కెమేరాలతో మదనపల్లి మండలం మాలేపాడు, పెంచుపాడు  ప్రాంతాలను జల్లెడ పట్టారు అధికారులు. సుమారు పది కిలోమీటర్ల పరిధిలో ఏరియల్‌ సర్వే చేశారు.

దీని వెనుక ఉన్నది ఎవరు..?

ఇదిలావుంటే, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల అల్లనేరేడు, మొక్కజొన్న, టమాటో పంట మధ్యలో అంతర పంటగా దీన్ని సాగుచేస్తున్నారు. ఎవరికీ తెలికుండా కాయలు దిగుబడి రాగానే కోసి ఎగుమతి చేస్తున్నారు.  గసగసాల కాయలను కిలో రూ.4 వేలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పదిసెంట్ల పరిధిలో సాగు చేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్న కాయలతో పాటు గసగసాల మొక్కల్ని పీకించేసి తగులబెట్టారు అధికారులు. అయితే, భూ యజమాని ఎవరు? పొలంలో పంట వేసిన రైతు ఎవరు? వీరిని ఆ పంట వేయమని సాగు చేయిచిందెవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ రైతుల వెనుక ఓ మాఫియా ముఠా ఉందని, ముంబైకి చెందిన ఓ మహిళ చిత్తూరు జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసిన ఈ దందా కొనసాగిస్గున్నట్లు సమాచారం.

నిషేధిత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే గసగసాల పంట పండించిన ముగ్గురు రైతులపై కేసులు నమోదు చేశామని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెన్స్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే, ఈ పంట పండించకూడదన్న విషయం తమకు తెలీదని తమకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నాయకులు. గసగసాల కాయలకు గాట్లు పెడితే జిగురు వస్తుందని.. ఈ జిగురును హెరాయిన్‌ తయారీకి వినియోగిస్తారని తెలుస్తోంది.

Also Read:

పదివేలతో ఈ వ్యాపారం ప్రారంభించండి.. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించండి.. సింపుల్ బిజినెస్..

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో