Telangana Police : నేరగాళ్లు బహుపరార్..! తెలంగాణ పోలీస్ సరికొత్త నిర్ణయం.. ఇకనుంచి డ్రోన్ కెమెరాస్‌తో పహారా..
Telangana Police : తెలంగాణ పోలీసులు క్రైమ్ రేట్‌ని తగ్గించడానికి సరికొత్త పద్దతిలో ముందుకు వెళుతున్నారు. డయల్ 100కు
Telangana Police : తెలంగాణ పోలీసులు క్రైమ్ రేట్‌ని తగ్గించడానికి సరికొత్త పద్దతిలో ముందుకు వెళుతున్నారు. డయల్ 100కు కాల్ రావడంతోనే సైరన్‌తో కూడిన డ్రోన్ కెమెరాస్‌తో పర్యవేక్షణ చేయనున్నట్లు చెబుతున్నారు. వివిధ ఏజెన్సీల నుంచి అనుమతి పొందిన తరువాత.. మొదటగా వీటిని పెట్రోలింగ్ పోలీసులకు సాయం చేయడానికి ఉపయోగిస్తామని తెలిపారు. ఈ రకం డ్రోన్ కెమెరాను బెంగళూరుకు చెందిన ఒక సంస్థ రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ..
ఈ డ్రోన్ కెమెరాలు డయల్ 100 ప్రతిస్పందనగా, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ఏరియాలలో మొదటగా అమర్చుతామని తెలిపారు. ‘పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్’ ప్రారంభోత్సవం సందర్భంగా ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీ రామారావు ఈ ఆలోచనను రూపొందించారని తెలిపారు. నేరాలను నియంత్రించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని వారు కోరారన్నారు. పోలీసులు 2020 నవంబర్‌లో ఈ ప్రాజెక్టుపై పనిచేయడం ప్రారంభించారని చెప్పారు. ఒకసారి మోహరించిన తర్వాత, పోలీసులు నేరస్థలానికి చేరుకునే సమయం తగ్గించబడుతుందన్నారు.
1.5 నుంచి 2 కిలోల బరువున్న డ్రోన్ కెమెరాకు మైక్, సైరన్ అమర్చిన తరువాత, దాని బరువు 4 నుంచి 5 కిలోలు ఉంటుందని తెలిపారు. ఇది ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో అమర్చుతామని చెప్పారు. పోలీస్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది 100 డయల్ నుంచి సమాచారాన్ని డ్రోన్లోకి అందిస్తారని, ఇది ఆటో మోడ్ ద్వారా నేరస్థలానికి చేరుకుంటుందని వివరించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది డ్రోన్ కెమెరా అందించిన విజువల్స్ చూసి అవసరమైన చర్య తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రతి డ్రోన్ కెమెరాకు రూ. 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఒక అంచనా ప్రకారం.. నగరంలోని మూడు కమిషనరేట్‌లను కవర్ చేయడానికి, సుమారు 75 డ్రోన్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. పోలీసు అధికారులు ఈ డ్రోన్ కెమెరాలను ప్రారంభంలో నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చుతున్నారు.