AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి ఘన విజయం
AP MLC Elections counting: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్‌టీయూ, గుంటూరు ఏసీ కళాశాలల్లో కొనసాగుతోంది. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ..
AP Teachers MLC Elections: కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత విజయం సాధించారు. తన విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడంతో కల్పలత గెలిచారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
కల్పలత విజయం..
ఈ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 12,554 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 6,153 ఓట్లు రాకపోవడంతో..రెండవ ప్రాధాన్యత లెక్కింపులో కల్పలతను విజేతగా అధికారులు ప్రకటించారు. తన విజయం కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని కల్పలత అన్నారు.
యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు. 1537 ఓట్ల మెజారిటీతో ఆయన ఆయన విజయం సాధించారు.
కౌంటింగ్ జరిగే తీరు ఇలా ఉంటుంది…
ముందుగా పోలైన ఓట్లల్లో తొలుత చెల్లుబాటు కాని వాటిని బ్యాలెట్ బ్యాక్సుల నుంచి వేరు చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికీ తొలి ప్రాధాన్య ఓటు పడకపోయినా దాన్ని చెల్లనిదిగానే పరిగణిస్తారు. చెల్లుబాటు కానివాటిని వేరు చేసిన తర్వాత కౌంటింగ్ అధికారులు చెల్లుబాటయ్యే వాటిలోనుంచి 25 బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లెక్కింపు చేపడతారు.
చెల్లుబాటైన వాటిల్లో తొలి ప్రాధాన్యత..
చెల్లుబాటైన వాటిల్లో ఎవరైనా అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓట్లు 50 శాతం కన్నా ఒక్కటి ఎక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ తొలి ప్రాధాన్య ఓట్లు 50 శాతం కంటే ఎక్కువ రాకుంటే… వారిలో అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి బ్యాలెట్ పత్రంలో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి పడ్డాయో గుర్తించి ఆయా అభ్యర్థులకు వాటిని బదలాయిస్తారు. అందులో ఎవరైనా అభ్యర్థికి 50 శాతం కంటే ఒక్కటి అధికంగా వచ్చినా వారు గెలిచినట్లు ప్రకటిస్తారు.
50 శాతం కంటే ఒక్క ఓటైనా..
బదలాయిచిన తర్వాత కూడా ఫలితం తేలకుంటే.. తొలి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండో అభ్యర్థిని తొలగిస్తారు. అతని రెండో ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించిన అభ్యర్థికి వచ్చిన మూడో ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు కలుపుతారు. అలా ఎవరో ఒకరికి… 50 శాతం కంటే ఒక్క ఓటైనా అధికంగా వచ్చేంతవరకూ లెక్కింపు కొనసాగించి గెలిచింది ఎవరో నిర్ణయిస్తారు.
LIVE NEWS & UPDATES
-
కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కల్పలత విజయం
కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత విజయం సాధించారు. తన విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడంతో కల్పలత గెలిచారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
-
కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఫలితం వచ్చింది. ఈ స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉన్నారు.
-
-
నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీ
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. షేక్ సాబ్జీకి 7,983 ఓట్లు రాగా నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి.
-
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి ఘన విజయం
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు. 1537 ఓట్ల మెజారిటీతో ఆయన ఆయన విజయం సాధించారు.
-
మూడు షిఫ్టుల్లో సిబ్బంది ఓట్ల లెక్కింపు…
కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మూడు షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత ఓటును బట్టే అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉన్నాయి. 13575 ఓట్లకు గాను 12554 ఓట్లు పోలయ్యాయి. 92.95 శాతం పోలింగ్ జరిగింది.
-
-
అయిదుగురు మధ్య ప్రధాన పోటీ..
కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏసీ కాలేజీలో జరుగుతోంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలవగా.. అయిదుగురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల కౌంటింగ్‌కు 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
-
కాకినాడ JNTU కాలేజీలో కొనసాగుతున్న కౌంటింగ్..
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కాకినాడ JNTU కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
-
గుంటూరు జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
-
మొదలైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.
-
మూడో ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు కలుపుతారు..
బదలాయిచిన తర్వాత కూడా ఫలితం తేలకుంటే.. తొలి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండో అభ్యర్థిని తొలగిస్తారు. అతని రెండో ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించిన అభ్యర్థికి వచ్చిన మూడో ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు కలుపుతారు. అలా ఎవరో ఒకరికి… 50 శాతం కంటే ఒక్క ఓటైనా అధికంగా వచ్చేంతవరకూ లెక్కింపు కొనసాగించి గెలిచింది ఎవరో నిర్ణయిస్తారు.
-
50 శాతం ఓట్లు రాకుంటే ఎలా…!?
అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ రాకుంటే ఓట్ల లెక్కింపు అధికారులు ముందుగా ఇలా చేస్తారు. అభ్యర్థుల్లో అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లు దక్కించుకున్న అభ్యర్థిని గుర్తిస్తారు..వారిని ముందుగా తొలగిస్తారు.
ఆ అభ్యర్థి బ్యాలెట్ పత్రంలో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి పడ్డాయో గుర్తిస్తారు. ఆయా అభ్యర్థులకు వాటిని బదలాయిస్తారు. అందులో ఎవరైనా అభ్యర్థికి 50 శాతం కంటే ఒక్కటి అధికంగా వచ్చినా వారు గెలిచినట్లు ప్రకటిస్తారు.
-
చెల్లుబాటైన వాటిల్లో ఎవరైనా అభ్యర్థికి…
చెల్లుబాటైన వాటిల్లో ఎవరైనా అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓట్లు 50 శాతం కన్నా ఒక్కటి ఎక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.
-
చెల్లుబాటు కానివాటిని వేరు చేసిన తర్వాత…
చెల్లుబాటు కానివాటిని వేరు చేసిన తర్వాత కౌంటింగ్ అధికారులు చెల్లుబాటయ్యే వాటిలోనుంచి 25 బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లెక్కింపు చేపడతారు.
-
ముందుగా పోలైన ఓట్లల్లో ఇలా చేస్తారు…
ముందుగా పోలైన ఓట్లల్లో తొలుత చెల్లుబాటు కాని వాటిని బ్యాలెట్ బ్యాక్సుల నుంచి వేరు చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికీ తొలి ప్రాధాన్య ఓటు పడకపోయినా దాన్ని చెల్లనిదిగానే పరిగణిస్తారు.
Published On - Mar 18,2021 10:37 AM