YCP vs TDP: అనంతపురం జిల్లాలో భగ్గుమన్న గ్రూపు తగాదాలు.. వైసీపీ వర్గీయుడిపై వేట కొడవలితో దాడి..
YCP vs TDP: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గంగా దేవిపల్లి గ్రామంలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి.
YCP vs TDP: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గంగా దేవిపల్లి గ్రామంలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ వర్గీయుడు రత్నమయ్యపై టీడీపీ వర్గీయుడు రామాంజనేయులు వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో రత్నమయ్యకు తీవ్ర గాయాలు అవడంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రత్నమయ్యపై దాడికి పాల్పడిన రామాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా గంగా దేవిపల్లి గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి.. రత్నమయ్యను పరామర్శించారు. రత్నమయ్యపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలాఉంటే.. తాడిపత్రి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో మండలం మొత్తం పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 15మంది సీఐలు, 25 మంది ఎస్ఐతో పాటు 600 వందల మంది పోలీసులు, సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు డాగ్ స్క్వాడ్, డీఫ్ఎండితో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా టీడీపీ 18 వార్డులు, వైసీపీ 16 వార్డులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Also read: జ్యోతిరాధిత్య సింధియా ప్యాలస్ లో దొంగలు పడ్డారు, ఏమేం పోయాయో మరి ? మొదలైన పోలీసుల దర్యాప్తు
Telangana MLC Election Results 2021 LIVE: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు