AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకలు కాసిన ఏపీ ఎమ్మెల్యే.. దుడ్డుకర్ర చేతబట్టి.. తలపాగా చుట్టి.. ఆశ్చర్యపోయిన స్థానికులు

ఆమె ఓ నియోజకవర్గానికి ఎమెల్యే. ప్రభుత్వ ప్రొటోకాల్‌తో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే మహిళా ప్రజా ప్రతినిధి. అయితేనేమి ఉన్నట్టుండి మేకల కాపరి అవతారం..

మేకలు కాసిన ఏపీ ఎమ్మెల్యే.. దుడ్డుకర్ర చేతబట్టి.. తలపాగా చుట్టి.. ఆశ్చర్యపోయిన స్థానికులు
Mla Goats
K Sammaiah
|

Updated on: Mar 18, 2021 | 11:35 AM

Share

ఆమె ఓ నియోజకవర్గానికి ఎమెల్యే. ప్రభుత్వ ప్రొటోకాల్‌తో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే మహిళా ప్రజా ప్రతినిధి. అయితేనేమి ఉన్నట్టుండి మేకల కాపరి అవతారం ఎత్తారు. తలపాగ చుట్టి, చేతిలో కర్ర చేతబట్టి మేకల కాపరిగా మారారు. ఆమె ఎవరో కాదు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.

గురువారం నాడు నియోజకవర్గంలోని తాడికొండ మండలం దామర పల్లి గ్రామంలో ఓ దేవస్థానం కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో… రహదారిపై భారీగా మేకలు కనిపించాయి… వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే శ్రీదేవి.. తలపాగా కట్టి, చేత కర్రబట్టి… కాసేపు మేకల కాపరిగా మారిపోయారు.. అటుగా వెళుతున్న ప్రయాణికులు ఎమ్మెల్యే శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే ఏంటి మేకలు కాయడం ఏంటని నివ్వెరపోయారు.

ఎమ్మెల్యే శ్రీదేవి మేకల కాపరిగా మారిన దృశ్యం చూసి స్థానికులు ఈలలు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ రోడ్డు మీద అచ్చం మేకల కాపరిలాగే మేకలను కాస్తూ కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు ఎన్నికల సమయంలో చూస్తుంటాం.. కానీ ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో ఇలా ప్రజల్లో కలిసిపోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

రెండు చోట్లా గెలిచాడు.. చివరికి ఎక్కడా కాకుండా పోయాడు.. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన

కోటి ఎకరాల మాగాణం దిశగా తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో మారిన దశ.. రికార్డు స్థాయిలో వరిసాగు