Tadipatri Municipality: సీమలో అసలు సిసలైన రాజకీయం.. తాడిపత్రి నుంచి తాజా అప్‌డేట్ ఇది
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మంచి రంజుగా మారింది. మొత్తం వార్డులు 36 . టీడీపీ 18 వార్డుల్లో … వైసీపీ 16 వార్డుల్లో గెలిచాయి. సీపీఐ ఒక స్థానం..
Tadipatri Municipality: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మంచి రంజుగా మారింది. మొత్తం వార్డులు 36 . టీడీపీ 18 వార్డుల్లో … వైసీపీ 16 వార్డుల్లో గెలిచాయి. సీపీఐ ఒక స్థానం.. ఇండిపెండెంట్ మరో స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపీ తలారి రంగయ్య , ఎమ్మెల్సే పెద్దారెడ్డి ఎక్స్ అఫిషియో ఓట్లతో వైసీపీ బలం 18కి చేరింది. ఈ లెక్కన వైసీపీ-టీడీపీ సంఖ్యాబలం సరిసమంగా వుంది. మరి చైర్మన్‌గిరి దక్కేదెవరికి?.. ఆ పొద్దు జరిగిన గొడవేమో కానీ ఈ పొద్దు పైచేయి ఎవరిది? అన్నది నేడు తేలబోతుంది.
పొలిటికల్ టెన్షన్ నెలకున్న సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్నతాధికారులు 600 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. టీడీపీ కౌన్సిలర్లు రహస్య శిబిరం నుంచి తెల్లవారుజామున తాడిపత్రి చేరుకున్నారు. మరికాసేపట్లో కౌన్సిలర్ల పదవీ స్వీకారం అనంతరం.. ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. జిల్లా వ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థలో.. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, మేయర్, ఉప మేయర్ల ఎన్నిక జరగనుంది. సభ్యులందర్నీ ఎన్నుకున్న తరువాత ఛైర్మన్లు, మేయర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
Also Read: Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి
Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి