Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి

తాటిచెట్టు పై ఒకరెక్కితేనే విచిత్రంగా చూస్తాం.. కానీ ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కితే... అది నిజంగా వింతే కదూ..నమ్మలేక పోతున్నారా..? గీత కార్మికుల సంప్రదాయ పండుగ సందర్భంగా....

Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు... అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి
GOuds Festival
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 18, 2021 | 8:54 AM

తాటిచెట్టు పై ఒకరెక్కితేనే విచిత్రంగా చూస్తాం.. కానీ ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కితే… అది నిజంగా వింతే కదూ..నమ్మలేక పోతున్నారా..? గీత కార్మికుల సంప్రదాయ పండుగ సందర్భంగా నిర్వహించిన ఆ వేడుక తాలూకా చిత్రాలివి.

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గౌడ కులస్తులు ఎల్లమ్మ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అబ్బుర పర్చాయి. వారి ఇలవేల్పు దైవం ఎల్లమ్మకు బోనాలు సమర్పించిన అనంతరం సామూహిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడకులస్తులు మోకు, ముస్తాదులతో గ్రామంలో ర్యాలీ తీశారు. ఆ అనంతరం ఒకే తాటిచెట్టుపై 17మంది గీత కార్మికులు ఇలా మోకు, ముస్తాదులతో చెట్టుపైకి ఎక్కి సందడి చేశారు. ఈ ఉత్సవంలో చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసికట్టుగా తాటి చెట్టు ఎక్కడంలో పోటీ పడ్డారు. ఈ దృశ్యం చూడటానికి చాలా వింతగా కనిపించినా.. వీరి ఆచారం ప్రకారం ఇలా ప్రతి ఏటా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ కులదైవం చల్లంగా చూడడంతో పాటు.. రాబోయే కాలంలో అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం వీరికి అనాధిగా వస్తోంది. దీంతో ప్రతి ఏటా మార్చి నెలలో ఈ ఉత్సవాన్ని పెద్ద పండుగలా చేస్తుంటారు. ఊరులో ఉన్న గౌడ కులస్తులు మొత్తం ఒక్క చోట చేరి వారి కుల దైవాన్ని ప్రత్యేకంగా అలంకరించి.. రోజంతా పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అందరు కలిసి సామూహికంగా భోజనాలు కూడా చేస్తారు. దీనంతటికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం తాటిచెట్టు ఎక్కడమేనంటున్నారు ఇక్కడి యువకులు.

Also Read:  Krishna District: స్వీట్ షాపులో పనికి వెళ్లి.. లాడ్జీలో అపస్మారక స్థితిలో.. చికిత్స పొందుతూ మృతి.. అంతా మిస్టరీ

        Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి